YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సుప్రీంను ఆశ్రయిస్తా ఎమ్మెల్యే వనమా

సుప్రీంను ఆశ్రయిస్తా ఎమ్మెల్యే వనమా

హైకోర్టు సంచలన తీర్పు

హైదరాబాద్
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పై రాష్ట్ర హైకోర్టు అనర్హత వేటు వేసింది. అయన ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్  ఇచ్చారని కోర్టును జలగం వెంకట్రావు ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని తీర్పును వెలువరించింది. ఈసీకి తప్పుడు అఫిడవిట్ ఇచ్చినందుకు ఎన్నిక చెల్లదన్న హైకోర్టు, వనమాకు ఐదు లక్షల జరిమానా విధించింది. 2018 ఎన్నికల్లో సమీప అభ్యర్థిగా ఉన్న జలగం వెంకట్రావును విజేతగా ప్రకటించింది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున వనమా గెలిచారు. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు.

సుప్రీంను ఆశ్రయిస్తా ఎమ్మెల్యే వనమా
తన ఎమ్మెల్యేసభ్యత్వం పై హైకోర్టు తీర్పును సుప్రీంకోర్ట్ లో వనమా  సవాలు చేయనున్నారు. జన బలంతో, మెజారిటీ ఓట్లతో గెలిచిన వారు ఎమ్మెల్యే. , ప్రజా క్షేత్రంలో గెలవాలి తప్ప, దొంగ కేసులతో, ఒడిన దగ్గర నుంచి, ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోకుండా, హైదరాబాద్ కోర్ట్ ల చుట్టూ తిరిగే వారు ఎప్పటికి ఎమ్మెల్యే కాలేరు.  న్యాయం ఎప్పటికైనా గెలుస్తుంది, సుప్రీంకోర్టును సంప్రదిస్తా.  రెండు రోజుల్లో స్టే వస్తుంది.ఎవ్వరు అధైర్య పడవద్దని అయన అన్నారు

Related Posts