YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఎన్నికలప్పుడే కేసీఆర్ కు బంధులు గుర్తుకువస్తాయి

ఎన్నికలప్పుడే కేసీఆర్ కు బంధులు గుర్తుకువస్తాయి

నల్గోండ
నల్లగొండ జిల్లా  నార్కట్ పల్లి న్యూవివేర లో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎంపి మాట్లాడుతూ ఎంతో చరిత్ర ఉన్న నార్కట్ పల్లి ఆర్టీసీ డిపోను ఎత్తివేయ్యవద్దని ఆర్టీసీ ఎండీ సర్జనార్ ని కోరినా. డిపో స్థలంలో ఎలాంటి  కాంప్లెక్స్, మాల్ ని నిర్మించొద్దని ఎండిని కోరానని అన్నారు.
తెలంగాణ లో రైతులు మూడు పంటలతో సంతోషంగా ఉన్నారని సీఎం కేసీఆర్ అన్నారు. అలాంటప్పుడు మూడు సార్లు రైతుబంధు ఎందుకు ఇవడం లేదో సీఎం చెప్పాలి. ఇప్పటికే చాలా మందికి 5 ఎకరాలు ఉన్న రైతులకు డబ్బులు ఇవ్వలేదు.  24 గంటల కరెంట్ పై నేను లాగ్ బుక్ ద్వారా నిజానిజలు తేల్చకే.. కొన్ని చోట్ల 24 గంటల కరెంట్ ఇచ్చిరు. నేరుగా రైతుల వద్దకు వెళ్లి.. కరెంట్ ఎలా ఇస్తున్నారో ప్రజలకు తెలిసేలా చేస్తాం. కరెంట్ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు కరెంట్ షాక్ తో చనిపోతున్న పట్టించుకున్న పాపాన సీఎం కేసీఆర్ పోలె. సీఎం కేసీఆర్ కి ఎన్నికలు వచ్చినప్పుడే ఆ బందు ఈ బందు  గుర్తుకు వస్తాయి. ఇప్పటివరకు ఎంత మందికి దళిత బంధు ఇచ్చారో ఎవరెవరికి ఇచ్చారో అని అన్నారు.
రాష్టంలో నెక్స్ట్ రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే. కుంభం అనిల్ పై మాట్లాడడానికి అయన సుముఖత చూపలేదు.

Related Posts