YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సిరుల పంటగా టమాటా

 సిరుల పంటగా టమాటా

తిరుపతి, జూలై 26, 
ప్రస్తుతం టమాటా పంట రైతులకు సిరులపంటగా మారింది. టమాటా తోట ఉన్నవారు ఉన్నపాటుగా కోటేశ్వరులైపోతున్నారు. మెదక్ జిల్లాలో మహిపాల్ రెడ్డి ఇప్పటికే రూ.2 కోట్ల విలువ చేసే టమాటాలను విక్రయించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో రైతు నెల రోజుల్లోనే ఏకంగా రూ.3 కోట్ల ఆదాయం గడించాడు. చిత్తూరు జిల్లాకు చెందిన సోమల మండలం కరకమందకు చెందిన చంద్రమౌళి తన తమ్ముడు మురళి, తల్లి రాజమ్మతో కలిసి ఉమ్మడిగా వ్యవసాయం చేస్తున్నాడు. సొంతూరు కరకమందలో 12 ఎకరాలు, పులిచెర్ల మండలం సువ్వారపుపల్లెలో 20 ఎకరాల పొలం కలిగిన చంద్రమౌళి కుటుంబం ఏళ్ల నుంచి టమాటా సాగును పండిస్తోంది. ఈ క్రమంలోనే చంద్రమౌళి ఈ సారి కూడా తమ పొలంలో అదే పండను వేశారు.అంతే.. మార్కెట్‌లో కేజీ టమాట ధర రూ.150 నుంచి రూ.180 వరకు ఉండడంతో చంద్రమౌళి చేసిన 22 ఏకరాల టమాటా సాగు బంగారు పంటగా మారింది. జూన్, జూలై నాటికి పంట చేతికి వచ్చేలా సాగు చేయడం కలిసి వచ్చిందని చంద్రమౌళి చెబుతున్నారు. కట్టెసాగు విధానంలో మల్చింగ్‌, సూక్ష్మ సేద్య పద్ధతులు పాటించామని.. జూన్‌ చివరిలో దిగుబడి మొదలవ్వగా కర్ణాటకలోని కోలార్‌ మార్కెట్‌లో విక్రయించామని చంద్రమౌళి తెలిపారు. మార్కెట్‌లో 15 కిలోల టమాట బాక్స్ ధర రూ.వెయ్యి నుంచి రూ.1500 మధ్య పలికింది. ఈ క్రమంలో 40 వేల పెట్టెలను చంద్రమౌళి విక్రయించగా రూ. 4 కోట్లు ఆదాయం వచ్చిందని.. 22 ఎకరాలకు పెట్టుబడి రూపంలో రూ.70 లక్షలు కాగా, కమీషన్‌గా 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు అయినట్లు తెలిపారు.మొత్తం ఖర్చులు పోగా చేతికి రూ.3 కోట్ల ఆదాయం వచ్చిందని చంద్రమౌళి అన్నారుజూన్, జులై నాటికి పంట చేతికి రావడంతో రైతు చంద్రమౌళి.. కర్ణాటక కోలార్‌ మార్కెట్‌లో విక్రయించాడు. 15 కిలోల టమాటా బాక్స్ ధర రూ. 1000 నుంచి రూ.1500 మధ్య పలికింది. రైతు చంద్రమౌళి 40 వేల పెట్టెలను విక్రయించగా దాదాపు రూ. 4 కోట్లు ఆదాయం వచ్చింది. 22 ఎకరాల్లో టమాటా సాగుకు పెట్టుబడికి రూ.70 లక్షలు, కమీషన్‌ రూ. 20 లక్షలు, రవాణా ఖర్చులు 10 లక్షలు ఖర్చు అయినట్లు చంద్రమౌళి తెలిపారు. సాగు ఖర్చులు పోగా రూ.3 కోట్ల మిగిలాయని ఆనందం వ్యక్తం చేశారు.మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని మొహమ్మద్ నగర్ కి చెందిన బాన్సువాడ మహిపాల్ రెడ్డి అనే రైతు తన 8 ఎకరాల్లో టమాటా పంట వేశాడు. సరిగ్గా టమాట ధరలు వంద రూపాయలకు కేజీ దాటే సమయానికి జూన్ 15 కి మహాపాల్ రెడ్డి పంట చేతికి వచ్చింది. ఈ నెల రోజుల సమయంలోనే ఈ రైతు సుమారుగా కోటి 90 లక్షల రూపాయలు సంపాందించాడు. జూన్ 15 నుంచి మొదలుకొని ఇప్పటివరకు, మహిపాల్ రెడ్డి సుమారుగా 7,000 క్రేట్ల టమాటాలను పఠాన్ చెరువు, బోయిన్ పల్లి, షాపూర్ మార్కెట్ లో కొనుగోలు చేశారు. ఒక్కో క్రేట్ లో 25 కేజీల టమాటాలు ఉంటాయి. సుమారుగా ఒక క్రేట్ ప్రస్తుతం రూ.2,600 ధర పలుకుతుందని చెబుతున్నారు రైతు మహిపాల్ రెడ్డి. ఇంకా తన పంటలో సుమారుగా 5,000 క్రేట్ల టమాటాలు పంట వస్తుందని అంచనా వేస్తున్నారు. ధర ఇలాగే ఉంటే వచ్చే నెలలో మరో కోటి కోటిన్నిర వరకు ఆదాయం రావొచ్చు అని అంటున్నారు. సుమారుగా 20 సంవత్సరాలుగా కూరగాయలు పండిస్తున్నానని చెప్పిన మహిపాల్ రెడ్డి... తన జీవిత కాలంలో ఒక్క నెలలోనే ఇంత డబ్బుని ఎప్పుడు చూడలేదు అని సంతోషం వ్యక్తం చేశారు.

Related Posts