YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఐఏఎస్ అధికారి పాదయాత్ర

ఐఏఎస్ అధికారి పాదయాత్ర

నెల్లూరు, జూలై 26, 
 ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు రిటైర్‌ అయ్యాక రాజకీయాల్లో ప్రవేశించాలనుకోవడం ఇటీవలి కాలంలో సాధారణం అయిపోయింది. వారిలో కొందరిని మాత్రమే అదృష్టం వరిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలి అనుకున్న రిటైర్డ్‌ అధికారి కూడా ఏపీలో పాదయాత్ర ప్రారంభించారు.ఐఏఎస్‌, ఐపిఎస్‌ అధికారులు రిటైర్‌ అయ్యాక రాజకీయాల్లో ప్రవేశించాలనుకోవడం ఇటీవలి కాలంలో సాధారణం అయిపోయింది. వారిలో కొందరిని మాత్రమే అదృష్టం వరిస్తోంది. రిటైర్మెంట్ తర్వాత పొలిటికల్ కెరీర్‌లో కొత్త ఇన్నింగ్స్‌ మొదలు పెట్టాలి అనుకున్నఓ ఐఏఎస్‌ అధికారి ఏపీలో పాదయాత్ర ప్రారంభించారు. తడ నుంచి తుని వరకు చేపట్టిన ఈ యాత్ర ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన ఐఏఎస్ అధికారి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. రిటైర్మెంట్ తర్వాత కూడా ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న జిఎస్‌ఆర్‌కె విజయ్‌కుమార్‌ ఐక్యతా విజయపథం పేరుతో పేదల సమస్యలు తెలుసుకోడానికి పాదయాత్ర బాట పట్టారు.రిటైర్డ్ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్‌ చేపట్టిన యాత్ర వెనుక ఉద్దేశాలపై రాజకీయ పార్టీలతో పాటు అధికార వర్గాల్లో కూడా ఆసక్తి నెలకొంది.ఏ విషయంలో అంతా తానై వ్యవహరించడానికి ఇష్టపడే ఐఏఎస్‌ అధికారుల్లో ఒకరైన విజయ్‌కుమార్‌ పేదలు ఎదుర్కొంటున్న సమస్యలు, స్థితిగతులను గ్రామాల వారీగా తెలుసుకోవడానికే యాత్ర చేపట్టినట్టు చెబుతున్నారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా పేదలకు చేయాల్సింది చాలాఉందని, పేదలకు ఏమి చేయాలనేది తెలుసుకోడానికి ఈ యాత్రను చేపట్టినట్టు చెబుతున్నారు. మూడు దశల్లో తాను యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. మొదట తడ నుంచి తుని వరకు యాత్రను ప్రారంభించి, రాయలసీమ, ఏజెన్సీ ప్రాంతాల్లో తర్వాతి దశల్లో పర్యటిస్తానని చెప్పారు.రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పేద వర్గాలను కలిసి సాంఘిక, ఆర్దిక సమానత్వం కోసం ప్రయత్నించాలన్నది తన ఉద్దేశమన్నారు. వివక్ష లేని సమాజాన్ని నెలకొల్పడమే తన లక్ష్యమని విజయ్‌కుమార్‌ ప్రకటించారు. పేదరికం పై విజయం సాధించే లక్ష్యంతో ఐక్యతా విజయ పథం యాత్ర చేపట్టినట్టు విజయ్ కుమార్ తెలిపారు.బహు ముఖాలు కలిగిన పేదరికాన్ని అర్థం చేసుకునే దిశగా ప్రజలను కలిసేందుకు తడ నుంచి తుని వరకు చేపట్టానని ప్రకటించారు. పేదల విజయం కోసం వివేకం పేరుతో యాత్ర చేపతున్నామని వెల్లడించారు. పేదల ప్రాతినిధ్యం తోనే సమూలంగా పేదరికాన్ని నిర్మూలన చెయ్యచ్చని చెబుతున్నారు.అధికారంలో ఉన్న సమయంలో ముఖ్యమంత్రికి అత్యంత సన్నిహితంగా మెలిగిన ఐఏఎస్ అధికారుల్లో ఒకరైన విజయ్‌కుమార్‌, సిఎం అమోదం, అనుమతితోనే యాత్ర ప్రారంభించినట్లు ప్రచారం జరుగుతోంది. బ్యూరోక్రాట్ వర్గాల్లో ఏ టూ జడ్ ఆఫీసర్‌గా ఆయన గుర్తింపు పొందారు. పనిచేసే చోట చొరవగా ఉండటంతో పాటు తన కనుసన్నల్లోనే వ్యవహారాలు నడపాలనే తీరుతో ఆయనకు ఆ గుర్తింపు వచ్చింది.ఎన్నికలకు ముందు ఐఏఎస్ అధికారి యాత్ర చేపట్టడంపై రకరకాల సందేహాలు ఉన్నాయి. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు చెబుతున్నారు. విజయ్‌కుమార్‌ 2020లోనే వివేకం పేరుతో ఓ ఎన్జీవోను ఏర్పాటు చేశారు. ఆయన సతీమణి ద్వారా ఆ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సొంత సంస్థను ఏర్పాటు చేసినా, రిటైర్మెంట్‌ తర్వాత కూడా ఆ‍యన సిఎంఓలో కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఏపీలో విమర్శల్ని ఎదుర్కొన్న జిల్లాల పునర్విభజన మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది.తాజా యాత్ర ద్వారా ప్రజల్లో నాయకుడిగా గుర్తింపు పొందడంతో పాటు ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అభిప్రాయాాలను తెలుసుకునే అవకాశం ఉండటంతోనే యాత్ర చేపట్టినట్టు కనిపిస్తోంది. స్వామికార్యం-స్వకార్యం నెరవేరేఅవకాశాలుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను నిర్వహించేందుకు సిద్దమైనట్లు ప్రచారం జరుగుతోంది. యాత్ర ద్వారా సేకరించే వివరాలతో కొత్త సంక్షేమ పథకాలకు రూపకల్పన చేయొచ్చని అధికార వర్గాల్లో చర్చ నడుస్తోంది. ప్రధానంగా ఏపీలో అధికార పార్టీకి ఓటు బ్యాంకులుగా ఉన్న వర్గాలను ఆకట్టుకునేలా కొత్త పథకాల రూపకల్పన చేసే లక్ష్యంతోనే పాదయాత్ర చేస్తున్నట్లు చెబుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రకటించే మ్యానిఫెస్టోలో స్థానం దక్కించుకునేలా కొత్త స్కీములకు శ్రీకారం చుట్టేందుకే ఈ కసరత్తు చేస్తున్నారని చర్చ నడుస్తోంది.ఇటీవల విజయవాడలో నిర్వహించిన సమావేశంలో 2019 తర్వాత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు తొలగించిన సంక్షేమ పథకాలపై పలు ప్రశ్నల్ని విజయ్‌కుమార్ ఎదుర్కోవాల్సి వచ్చింది. విద్యా, ఉపాధి పథకాలను రద్దు చేయడంపై అయా సంఘాల నుంచి నిరసన ఎదుర్కోవాల్సి వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడం ద్వారా అయా సామాజిక వర్గాలను మచ్చిక చేసుకోడానికి అవసరమయ్యే ప్రణాళికను రూపొందించడం కూడా వ్యూహమై ఉంటుందనే సందేహాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా యాత్రను నిర్వహించేందుకు కావాల్సిన వనరులు, సదుపాయాలు ఎవరు కల్పిస్తున్నారనే సందేహాలు కూడా ఉన్నాయి.

Related Posts