YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

మూసీకి వరద పోటు…బీబీనగర్ కు నిలిచిన రాకపోకలు

మూసీకి వరద పోటు…బీబీనగర్ కు నిలిచిన రాకపోకలు

యాదాద్రి
యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ - పోచంపల్లి మధ్య లో లెవెల్ వంతెన పై నుండి మూసి నది భారీగా ప్రవహిస్తోంది. దాంతో గత నాలుగు రోజులుగా బీబీనగర్, రుద్రవెల్లి, భూదాన్ పోచంపల్లి మండలం జూలూరు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

ఆకేరు వాగు లో జలకళ
అల్పపీడన ప్రభావంతో ఎగువ కురుస్తు న్న భారీ వర్షాలతో మొదటిసారి ఆకేరు వాగు ప్రవహించినప్పుడు ప్రజలు, రైతులు తొలకరి వర్షాలతో ఆనందం వ్యక్తం చేశారు. రైతులు వరి నార్లు పోసుకొని ఏరువాకను ప్రారంభించారు. కాని రెండవసారి అనగా గత ఐదు, ఆరు రోజుల నుంచి ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలతో వాగులు,వం కలు చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తు న్నాయి. ముఖ్యంగా ఆకేరువాగు అత్యంత ప్రమాదకర స్థాయిలో ప్రవ హిస్తుంది. మరలా భారీ వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాలు మునిగే అవకాశం ఉండడంతో వివిధ గ్రామాల ప్రజలను అక్కడ అధికారులు అప్రమత్తం చేస్తు న్నారు.వరంగల్ పాలేరు వాగు పొంగి పొర్లి ప్రవ హిస్తుండడంతో దంతాలపల్లి - పెద్ద ముప్పారం గ్రామాల మధ్య రాకపో కలు పూర్తిగా బంద్ అయ్యా యి.అలా గే నరసింహులపేట మండ లం నుంచి కౌసల్య దేవి పల్లి గ్రామానికి వెళ్లే దారి లో లో లెవెల్ బ్రిడ్జి పై నుండి ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండ డంతో పూర్తిగా రాకపోకలను అధికారు లు నిషేధించారు. అలాగే చిన్నగూడూ రు మండలంలో నుండి పగిడిపల్లి, గుం డం రాజు పల్లి కి వెళ్లేదారిలో జిన్నేల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అధికారులు నిరంతరం గస్తి కస్తూ రోడ్డుకు అడ్డంగా ముళ్ళకంచని ఏర్పాటు చేశారు.

లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు
గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో… నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరంగల్ పోలీస్ కమిష నర్ ఏవీ రంగనాథ్ పోలీస్ అధికారు లతో పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ వరంగల్ హంటర్ రోడ్ లోని ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందా వన్ లలో పూర్తిగా వరద నీరు రావడం తో వరంగల్ పోలీస్ కమిషనర్ స్థానిక పోలీస్ అధికారులతో కల్సి ట్రాక్టర్ లో ప్రయాణించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు.కాలనీల్లో వరద నీరు చేరుకోవడంతో ఈ కాలనీల్లో నివాసం వుంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతా లను తరలింపు విషయమై పోలీస్ కమిషనర్ వరంగల్ ఏసీపీ బోనాల కిషన్, మట్టేవాడ ఇన్స్ స్పెక్టర్ వెంకటే శ్వర్లు, బీఆర్ఎస్ నాయకుడు గందే నవీన్ ను అడిగి తెలుసుకున్నారు. హంటర్ రోడ్డులోని ఎన్టీఆర్ కాలనీ, సాయినగర్ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్ లలో పెద్ద స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో పోలీస్ కమిషనర్, జిల్లా కలేక్టర్ ఆదేశాల మేరకు మట్టేవాడ పోలీసులు వరంగల్ ఏసీపీ కిషన్, ఇన్స్ స్పెక్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, గ్రేటర్ వరంగ ల్ మన్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది సంయుక్తంగా కల్సి లోతట్టు ప్రాంతా ల్లోని ప్రజలను బొట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

ఆహ్లాదకరంగా మైతాపురం జలపాతం
ఆకాశం నుంచి జాలు వారే జలపాతం..పాల నురగ లతో పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తున్న పర్యాటక కేం ద్రం. వీకెండ్ హాలిడేస్ వచ్చాయంటే అనేకమంది పర్యాటకులు ఆ జలపాతం వద్ద ఉల్లాసంగా ఉత్సాహం గా గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆకాశానికి రంద్రం పడితే ఆకాశంలో నీరంతా భూమి పైకి చేరుతుంది అనే మాదిరిగా ఈ జలపాతం కనబడుతుంది.ఒక్క మాటలో చెప్పాలంటే ఆకా శగంగా అని పురాణాలలో ఏ విధంగా వర్ణించబడిందో అదే మాదిరిగా ఈ జలపాతం పర్యాట కులను ఎంతగానో కనువిందు చేస్తుంది. తెలంగాణ లోని ములుగు జిల్లా లోని పర్యాటక ప్రాంతాల్లో ఒక్క టైనా మైతాపురం జలపా తం అద్భుతాలకు కేరఫ్ గా నిలుస్తోం ది. అల్లంత దూరం నుంచి జాలువారు తున్న జలపాతాలు పర్యటకులకు రెడ్ కార్పేట్ పరుస్తూ ఆహ్లాదాన్ని అందిస్తూ మైమరిపిస్తున్నాయి.

Related Posts