YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

హిందూపురం బరిలో లక్ష్మీ పార్వతి

హిందూపురం బరిలో లక్ష్మీ పార్వతి

అనంతపురం, జూలై 28,
దివంగత సీఎం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు ఎన్టీఆర్ భార్యగా ల‌క్ష్మీపార్వ‌తి అందరికి సుపరిచితురాలే. ఎన్టీఆర్ ను ఆమె ఎలా పెళ్లి చేసుకున్నారు? ఆయనకు అసలు లక్ష్మీపార్వతి ఎలా దగ్గరయ్యారన్నది లోకానికి తెలిసిన కథే. అది పక్కన పెడితే ప్రస్తుతం ఆమె వైసీపీలో ఉన్నారు. అవకాశం వచ్చినప్పుడల్లా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబుపై విషం చిమ్మడమే పనిగా పెట్టుకున్నారు.   ఎన్టీఆర్ జీవించి ఉన్న కాలంలోనే రాజ‌కీయాల్లో కాళ్ళూ, చేతులు పెట్టిన లక్ష్మీపార్వతి ప్రత్యక్ష రాజకీయాలలో కూడా పోటీ చేశారు. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ నుండి పోటీ చేసిన లక్ష్మీ పార్వతిని ప్రజలు అప్పట్లో ఓడించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పటి వరకూ ఆమె ఎక్కడా పోటీలో నిలబడలేదు. అయితే వైసీపీ పంచన చేరి చంద్రబాబుపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆమె ఆ పార్టీలో చేరారు. ప్రస్తుతం  ఏపీ తెలుగు, సంస్కృత అకాడ‌మీ చైర్‌ప‌ర్స‌న్‌గా ఉన్నారు. ఇప్పటి వరకూ కేవలం చంద్రబాబు కుటుంబంపై ఆరోపణలు చేస్తున్నందుకే ఆమెకి పదవి ఇచ్చారన్నది పరిశీలకుల విశ్లేషణ.అయితే ఇప్పుడు   లక్ష్మి పార్వతి ప్రత్యక్ష రాజకీయాలలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఒక్కసారైనా చట్టసభలకు వెళ్లాలన్నది ఆమె చిరకాల వాంఛ. ఈ క్ర‌మంలో  త‌న ఉద్దేశాన్ని సీఎం జ‌గ‌న్ ద‌గ్గ‌ర   ప్రస్తావించినట్లు చెబుతున్నారు. మొత్తానికి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో పోటీకి  ఆమెకు జగన్   గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లు వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి. గ‌తంలో ఎన్టీఆర్ గెలిచిన స్థానాలలో ఎక్కడో ఒక చోట నుండి లక్ష్మీ పార్వతి పోటీ చేయాలని భావిస్తున్నారని అంటున్నారు.   ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లా హిందూపురం నుంచి ఆమె పోటీ చేసే అవ‌కాశం ఉంద‌ని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం హిందూపురం నుండి ఎన్టీఆర్ కుమారుడు  బాలకృష్ణ ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. వైసీపీ నుండి 2014లో నవీన్ నిశ్ఛల్, 2019లో ఇక్బాల్ బాలయ్యపై పోటీ చేసి ఓడిపోగా ఇప్పుడు ఇక్కడ నుండి లక్ష్మీ పార్వతిని రంగంలోకి దింపాలని వైసీపీ భావిస్తోందని అంటున్నారు.  ఈ మధ్యనే వైసీపీ హిందూపురం ఇంచార్జి పదవిని మహిళా నేత టీఎన్ దీపికకు అప్పగించింది. దీంతో బాలయ్య దీపికపై పోటీ చేయడం అవసరమా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అందుకే టీడీపీ కూడా ఇక్కడ మహిళా నేతనే దించాలని ఆలోచన చేస్తూ బాలయ్య కుమార్తె, చంద్రబాబు కోడలు నారా బ్రాహ్మణిని ఇక్కడ నుంచి రంగంలోకి దింపే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది.  ఇప్పుడు వైసీపీ నుండి దీపికాను తప్పించి లక్ష్మీ పార్వతిని రంగంలోకి దించాలని వైసీపీ యోచిస్తోందంటున్నారు. అదే జరిగితే హిందూపురం   రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారుతుందనడంలో సందేహం లేదు.

Related Posts