విజయవాడ, జూలై 28,
వైద్య రంగంలో సరికొత్త అధ్యాయం దిశగా అడుగులు వేసింది విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్. అడ్వాన్స్ టెక్నాలజీ రోబో తో వివిధ విభాగాల్లో వైద్యసేవలను అందించనుంది. ఫలితంగా సంక్లిష్ట సర్జరీలు కూడా సులభతరం కానున్నాయి. ఈ మేరకు గురువారం రాష్ట్ర గవర్నర్ కొత్త రోబో సేవలను ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్ వైద్యరంగానికి విశిష్ఠ సేవలందించిన మణిపాల్ హాస్పిటల్ విజయవాడ మరో సరికొత్త అధ్యాయానికి తెరతీసింది. నాల్గో తరానికి చెందిన డా విన్సీ × రోబోను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ రోబోను ఏపీ గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ ప్రారంభించారు.
ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడుతూ... వైద్యరంగంలో మరోకొత్త చరిత్రకు మణపాల్ హాస్పిటల్ తెరతీసిందని చెప్పారు. రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీ తో ఆంధ్రప్రదేశ్ వైద్యరంగం మరో కీలక మైలురాయిని అందుకుందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందని తెలిపారు. మణిపాల్ హాస్పిటల్స్ వారు ప్రవేశపెట్టిన ఈ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ అడ్వాన్స్ మెంట్ అనేది ఏపీ ఆరోగ్య సంరక్షణ సాంకేతికతలో ఒక గొప్ప ముందడుగు అని స్పష్టం చేశారు. రోబోటిక్ సర్జరీతో రోగులకు కచితత్వం ఉంటుందని చెప్పుకొచ్చారు. రోగులు త్వరగా కోలుకోవడం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ సాంకేతిక ఆవిష్కరణతో శస్త్రచికిత్సా విధానంలో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయన్నారు. ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలతో భారతదేశ వైద్య చరిత్రలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలుస్తుందని గవర్నర్ ఆశాభావం వ్యక్తం చేశారు.మణిపాల్ హాస్పిటల్ డైరెక్టర్ డా. సుధాకర్ కంటిపూడి మాట్లాడుతూ... విజయవాడ పరిసర ప్రాంతాల్లోని వైద్యరంగంలో అత్యాధునిక వైద్య సాంకేతికతను ముందుకు తీసుకురావలన్నదే మణిపాల్ హాస్పిటల్ విజయవాడ లక్ష్యమని తెలిపారు. అత్యంత నైపుణ్యతగల సర్జన్స్, పోస్ట్ ఆపరేటివ్, రీ హాబ్ కేర్ నిపుణుల బృందంతో అత్యున్నత ప్రమాణాల వైద్యసేవలను అందించడానికి తాము అంకితభావంతో ఉన్నామని తెలిపారు. భారతదేశంలో డా విన్సీ × (4వ తరం) సిస్టమ్స్ సర్జికల్ టెక్నాలజీలో అత్యాధునికమైనదని, దీనిని హాస్పిటల్ నందు నెలకొల్పామని తెలిపారు. ఈ సాంకేతిక అధ్భుతం అన్ని వర్గాల ప్రజలు అత్యున్నత వైద్యసేవలు పొందడానికి తోడ్పడుతుందని గుర్తు చేశారు.సంక్లిష్టమైన కేసులు నిర్వహించడానికి ఇది సర్జన్లకు తోడ్పడుతుంది. దాయ శస్త్ర చికిత్సా విధానంలో గల పరిమితులను అధిగమించడానికి మరియు కష్టతరమైన శస్త్రచికిత్సలను నిర్వహించే సర్జన్స్ యొక్క సామర్ధ్యాన్ని పెంచడానికి ఇది ఉద్దేశించబడింది. సర్జికల్ ఆంకాలజి, సర్కిల్ గ్యాసో ఇంటెసినల్, బేరియాట్రిక్, యూరాలజి, థొరాసిక్, జనరల్సరరీ, గెనకాలజి మరియు ఇంకా ఎన్నో స్పెషాలటీస్ విభాగాలలో రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీలు నిర్వహించబడతాయి. రొబోటిక్ అసిస్టెడ్ సర్జరీ ద్వారా లాభాలు ఎన్నో ఉన్నాయి.