YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాపం... వాసుపల్లి...

పాపం... వాసుపల్లి...

విశాఖపట్టణం, జూలై 29, 
విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పై పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. ఏ పార్టీలోకి వెళ్తావు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు? అంటూ గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు పెట్టారు.రాజకీయాల్లో నిలకడలేని నేత...నీకో నమస్కారం అంటూ విశాఖ సౌత్ లో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ ఫొటోతో పోస్టర్లు వెలిశాయి. స్థానికంగా ఈ పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. సొంత పార్టీలోని అసమ్మతి వర్గమే ఈ పోస్టర్లు పెట్టించిందని ఎమ్మెల్యే సన్నిహితులు భావిస్తు్న్నారు. 2019 ఎన్నికల్లో వాసుపల్లి గణేష్ విశాఖ సౌత్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. అయితే వాసుపల్లి గణేష్ ఎంట్రీతో అసంతృప్తితో ఉన్న నేతలు ఈ పోస్టర్లు పెట్టించారని ప్రచారం జరుగుతోంది. విశాఖ సౌత్ లో ప్రతిపక్షాల్లో బలమైన నేతలు లేకపోవడంతో... ఈ పోస్టర్ల పని సొంత పక్షం వాళ్లే చేసుకుంటాపని ఎమ్మె్ల్యే భావిస్తున్నారట.పోస్టర్ల కలకలంతో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇప్పటి నుంచి ప్రయత్నాలు మొదలైనట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ తో పాటు మరోవైపు సీతంరాజు సుధాకర్‌లు వైసీపీ తరఫున సీటు కోసం పోటీ పడుతున్నారు. గత ఎన్నికల్లో ఓటమి పాలైన సుధాకర్.. ఈసారి ఎలాగైనా సీటు సంపాధించి అసెంబ్లీకి వెళ్లాలని చూస్తున్నారు. అసెంబ్లీ టికెట్‌ కోసం అధిష్ఠానం వద్ద గట్ట ప్రయత్నాలే చేస్తున్నారు. మరోవైపు సిట్టింగ్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ తనదేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సత్తా తనకు ఉందంటున్నారు. దీంతో విశాఖ సౌత్ నియోజకవర్గం వైసీపీలో టికెట్ రేస్ నెలకొంది. ఈ తరుణంలో ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్‌కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. ఏ పార్టీలోకి వెళ్తావు? ఏ పార్టీ నుంచి పోటీ చేస్తావు? రాజకీయ నిలకడలేని నేత... నీకో నమస్కారం అంటూ గుర్తుతెలియని వ్యక్తులు పోస్టర్లు పెట్టారు. దీంతో పార్టీలో చర్చ మొదలైంది. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టింది సొంత పార్టీ వాళ్లేనని పలువురు చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కు వైసీపీ కార్పొరేటర్లకు మధ్య విభేదాలు రావడం, వైసీపీలో గణేష్ ఇంకా సెట్ కాకపోవడంతో... ఆయన మళ్లీ టీడీపీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది. వాసుపల్లి గణేష్ వ్యతిరేక వర్గాన్ని తనవైపు తిప్పుకునేందుకు సీతంరాజు సుధాకర్ ప్రయత్నిస్తున్నారని సమాచారం. వైఎస్ కుటుంబానికి సన్నిహిత నేతగా పేరున్న సీతంరాజు సుధాకర్... విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని భావించారు. వాసుపల్లి గణేష్ వైసీపీలోకి రావడంతో లెక్కలు తారుమారు అయ్యాయి. దీంతో గ్రూప్ రాజకీయాలు మొదలయ్యాయి. ఎమ్మెల్యేపై అసంతృప్తితో ఉన్న కార్పొరేటర్లని చేరదీసి వాళ్లతో రాజకీయం చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా వెలిసిన పోస్టర్లు ప్రతిపక్షాల కంటే సొంత పార్టీలోని నేతలే చేశారని గణేష్ భావిస్తు్న్నారని తెలుస్తోంది. టీడీపీ నుంచి ఎమ్మెల్యే గణేష్ వైసీపీలో చేరడంతో... పెందుర్తి ఎమ్మెల్యేగా పనిచేసిన గండి బాబ్జిని టీడీపీ ఇన్ ఛార్జ్ నియమించారు. జనసేనకు ఈ నియోజకవర్గంలో బలమైన నేతలేరు. దీంతో ఈ పోస్టర్ల పని సొంత పార్టీ నేతల పనేనని ఎమ్మెల్యే అనుమానిస్తు్న్నారని సమాచారం.

Related Posts