చిత్తూరు
ప్రేమకు ఎల్లలు లేవని పలు ఘటనలు నిరూపిస్తున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లాలో ఓ ఘటన వెలుగు చూసింది. ఫేస్బుక్ లో పరిచయమై ప్రియుడి కోసం శ్రీలంకకు చెందిన ఓ యువతి పర్యాటక వీసాపై వచ్చి అతన్ని వివాహం చేసుకుంది. వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆరిమాకులపల్లెకు చెందిన శంకరప్ప కుమారుడు లక్ష్మణ్ తాపీమేస్త్రీ. ఇతనికి శ్రీలంకలోని బేలంగూడు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరితో ఫేస్బుక్ లో పరిచయమైంది. వీరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో విఘ్నేశ్వరి పర్యాటక వీసాతో ఈనెల 8వ తేదీన చెన్నై చేరుకుంది. లక్ష్మణ్ అక్కడికి వెళ్లి ఆమెను ఇంటికి తీసుకువచ్చారు. లక్ష్మణ్ కుటుంబ సభ్యుల అంగీకారంతో వారిద్దరికీ జులై 20న వి.కోటలోని సాయిబాబా ఆలయంలో వివాహ మైంది. అప్పటి నుంచి యువతి ఆ కుటుంబంలో సభ్యురాలిగా మారిపోయింది. ఈ క్రమంలో పర్యాటక వీసాపై వచ్చిన ఆమె వి. కోట మండలంలో ఉందన్న సమాచారంతో జిల్లా ఎస్పీ మూడు రోజుల కిందట వారిని చిత్తూరుకు పిలిచించినట్లు తెలిసింది. ఆగస్టు 6న ఆమె వీసా గడువు ముగుస్తుందని, అప్పటిలోగా తిరిగి శ్రీలంక వెళ్లిపోవాలని ఆమెకు నోటీసులు జారీ చేశారు...