YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కరీంనగర్ లో 330 పంచాయితీలు

 కరీంనగర్ లో 330 పంచాయితీలు

పంచాయతీ ఎన్నికలకు కీలకమైన ఓటరు జాబితాను అధికారులు సిద్ధ్దం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఓటరు జాబితాను ఆధారం చేసుకొని పంచాయతీ ఎన్నికలకు ఓటరు జాబితాను సిద్ధం చేయాలని ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాల మేరకు కసరత్తు చేసిన అధికారులు  తుది జాబితా ప్రకటించారు. ఇందులో 2,11,026 మంది పురుష, 2,08,025 మంది మహిళా ఓటర్లు, ఇతరులు 14 మంది చొప్పున మొత్తం 4,19,065 మంది ఓటర్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జిల్లాలో ఇది వరకు 276 పంచాయతీలు ఉండేవి. ఇటీవల ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం కొత్తగా మరో 54 పంచాయతీలు ఏర్పడ్డాయి. వీటిలో కరీంనగర్ నగరపాలక సంస్థలో 8, జమ్మికుంట మున్సిపాలిటీలో 3, హుజూరాబాద్ మున్సిపాలిటీలో మరో 4 పంచాయతీలు విలీనమయ్యాయి. చొప్పదండి, కొత్తపల్లి మేజర్ పంచాయతీలు మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ అయ్యాయి. ఇక మిలిగిన 313 పంచాయతీల్లో అధికారులు ఎన్నికలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ గ్రామాల్లో 2,966 వార్డులను గుర్తించారు. వీటికి అనుగుణంగా అధికారులు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాలో 4,404 బ్యాలెట్ బాక్స్‌లు అవసరం ఉంటాయని భావించిన అధికారులు మహారాష్ట్రలోని వాసిం, కరంజీ, రిసోడ్ జిల్లాల నుంచి సుమారు 2,400 బ్యాలెట్ బాక్స్‌లు తెప్పించారు. ఇందుకు ఎంపీడీఓలకు బాధ్యతలు అప్పగించారు. పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు, సీసీబీసీలు, ఇతర గ్రామ స్థాయి సిబ్బందిని నియమించుకొని ఎంపీడీఓలు బీసీ ఓటర్ల గుర్తింపు చేపట్టారు. ప్రస్తుతం మూడు రోజులపాటు అభ్యంతరాలను విచారించి మార్కింగ్ చేస్తారు. ఈ నెల 28 నుంచి 30వ తేదీల్లో మూడురోజులపాటు గ్రామ సభలు నిర్వహించి, బీసీ ఓటర్ల తుది జాబితాను సిద్ధం చేస్తారు. జూన్ ఒకటిన ఈ జాబితాను ప్రకటిస్తారు. బీసీ ఓటర్లను గుర్తించేందుకు బీసీ సంక్షేమశాఖ గుర్తించిన కులాల జాబితాను సేకరించిన పంచాయతీ అధికారులు ఎంపీడీఓలకు పంపిణీ చేశారు. ఈ జాబితాను ఆధారం చేసుకుని బీసీ ఓటర్లను గుర్తిస్తున్నారు. పంచాయతీ ఎన్నికలపై గ్రామాల్లో అప్పుడే ఆసక్తి పెరుగుతున్నది. వార్డులవారీగా విభజించి పంచాయతీల్లో ప్రదర్శిస్తున్న ఓటరు జాబితాను పరిశీలిస్తున్నారు. తమ ఓటు ఏ వార్డులో ఉన్నదో తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఉత్సాహం చూపుతున్న వారు ఏ గ్రామాన్ని ఏ సామాజిక వర్గానికి కేటాయించే అవకాశాలున్నాయో తెలుసుకునే ప్రయ త్నం చేస్తున్నారు. జూన్ ఒకటిన బీసీ ఓటరు జాబి తా ప్రకటించిన తర్వాతనే రిజర్వేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు చెబుతున్నా రు. అయినా కొందరు అంచనాలు వేసుకుంటున్నారు. ఇక ముందు ఒక సామాజిక వర్గానికి చేసిన రిజర్వేషన్లు రెండు టర్ములు ఉంటాయని ప్రభుత్వం కొత్త పంచాయతీరాజ్ చట్టంలో పొం దుపర్చడంతో ఆయా సామాజిక వర్గాల నుంచి ఉత్సాహంగా ఉన్న కొందరు ఇప్పటి నుంచే ఆసక్తిని చూపుతున్నారు. మొత్తానికి పంచాయతీ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్ది గ్రామాల్లో రాజకీయ వాతావరణం క్రమంగా వేడెక్కుతోంది.

Related Posts