YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఐటీ కారిడార్ లో లేడీస్ స్పెషల్

ఐటీ కారిడార్ లో లేడీస్ స్పెషల్

హైదరాబాద్, జూలై 29, 
టీ కారిడార్ లో పని చేసే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ ఆర్టీసీ. వారికోసం ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. గత కొంతకాలంగా వినూత్న నిర్ణయాలతో ఆర్టీసీని బలోపేతం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అడుగులు వేస్తోంది. ఓ వైపు ప్రస్తుతం ఉన్న భారాన్ని తగ్గించుకోవటంతో పాటు... ప్రయాణికులను ఆకర్షించేలా మార్పులు తీసుకువస్తోంది. ఇప్పటికే చాలా ఆఫర్లను ప్రకటించగా… తాజాగా ఐటీ కారిడార్ లో పని చేసే మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది.హైదరాబాద్ ఐటీ కారిడార్ లో మహిళా ప్రయాణికుల కోసo ప్రత్యేక మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది టీఎస్ఆర్టీసీ. ఈ లేడీస్ స్పెషల్ బస్సు 'జేఎన్టీయూ-వేవ్ రాక్' మార్గంలో ఉదయం, సాయంత్రం నడుస్తుందని తెలిపింది. ఈ నెల 31 నుంచి అందుబాటులోకి వచ్చే ఈ ప్రత్యేక బస్సును.. మహిళా ప్రయాణికులు వినియోగించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సంస్థ కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు.: మున్నేరు వరద ప్రవాహంతో హైదరాబాద్‌ - విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోవడంతో గురువారం సాయంత్రం నుంచి రవాణా స్తంభించింది. ఈ మార్గంలో ప్రయాణించే బస్సులు పూర్తిగా నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ ప్రత్యామ్నయ మార్గంలో ప్రయాణాలను పునరుద్ధరించింది.హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై ఇంకా వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లా కీసర టోల్గేట్ సమీపంలోని ఐతవరం వద్ద మున్నేరు వాగు ఉధృతి నేపథ్యంలో ఆ రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్-విజయవాడ మార్గంలో రెగ్యులర్ సర్వీసులను తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ రద్దు చేసింది.ఈ మార్గంలో ఆర్టీసి సర్వీసులు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ప్రయాణంలో ఉన్న వారు ముందుకు వెళ్లే అవకాశం లేకపోవడంతో ఎక్కడివారు అక్కడే నిలిచిపోయారు. దీంతో టిఎస్‌ఆర్టీసీ ప్రత్యామ్నాయంగా హైదరాబాద్ నుంచి మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు మీదుగా విజయవాడకు బస్సులను నడపుతున్నట్లు ఆర్టీసి ఎండి సజ్జన్నార్ ప్రకటించారు.నార్కట్‌పల్లి గుంటూరు మార్గంలో ప్రతి అరగంటకో బస్సు హైదరాబాద్ లోని ఎంజీబీఎస్ నుంచి బయలుదేరుతుందని వివరించారు. ప్రయాణికులు ఈ సదుపాయాన్ని వినియోగించు కోవాలని ఎండీ కోరారు.. మరింత సమాచారం కోసం టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033ను సంప్రదించాలని టిఎస్‌ఆర్టీసి ఎండీ సజ్జన్నార్ సూచించారు.

Related Posts