YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఇప్పుడు మైనార్టీలకు లక్ష పథకం

ఇప్పుడు మైనార్టీలకు లక్ష పథకం

హైదరాబాద్, జూలై 29, 
మైనార్టీలందరికీ రూ.లక్ష ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన దరఖాస్తు తేదీలు, అర్హతలను ప్రకటించారు అధికారులు.
ఎన్నికల వేళ అన్ని వర్గాలను ఆకర్షించేలా తెలంగాణ సర్కార్ సరికొత్త పథకాలను ప్రకటిస్తోంది. ఇప్పటికే బీసీలలోని చేతి వృత్తులకు లక్ష సాయం ఇస్తుండగా... మైనార్టీలకు కూడా ఇదే తరహా స్కీమ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇందుకు సంబంధించిన కీలక అప్డేట్ ఇచ్చారు అధికారులు. దరఖాస్తు చేసుకోవాల్సిన తేదీలతో పాటు.... అర్హతలను వెల్లడించారు. పారు.ఈ లక్ష రూపాయలకు సంబంధించిన దరఖాస్తులు...జులై 31, 2023వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 14వ తేదీని తుది గుడువుగా నిర్ణయించారు. ఆన్ లైన్ విధానంలోనే అప్లికేషన్స్ స్వీకరిస్తారు. బ్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన మైనార్టీలందరికీ ఏకమొత్తంగా గ్రాంట్‌గా అందజేయనున్నారు.
అర్హతలు :
- ముస్లింలకు మైనార్టీ ఆర్థిక సహకార సంస్థ నుంచి ఈ సాయాన్ని అందిస్తారు. ఇతర మైనార్టీలకు క్రిస్టియన్‌ మైనార్టీ కార్పొరేషన్‌ నుంచి ఆర్థిక సహాయం అందజేయనున్నారు.
- ఈ పథకానికి 21 నుంచి 55 ఏండ్ల లోపు వారు అర్హులు.
- వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించకూడదు.
- కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ స్కీమ్వర్తిస్తుంది.
- దరఖాస్తులు ప్రారంభం - 31 జులై , 2023
-దరఖాస్తులకు తుది గడువు - ఆగస్టు 14,2023
- కలెక్టర్ల నేతృత్వంలోని జిల్లా మానిటరింగ్‌, స్క్రీనింగ్‌ కమిటీ లబ్ధిదారులను ఎంపిక చేస్తుంది.
-ఆ జాబితాకు కలెక్టర్లు సంబంధిత జిల్లా మంత్రుల ఆమోదం పొందాల్సి ఉంటుంది.
మైనార్టీలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు, ఈ స్కీమ్ ను ప్రకటిస్తున్నట్లు తెలంగాణ సర్కార్ తెలిపింది.

Related Posts