YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరద ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన

వరద ప్రాంతాల్లో కిషన్ రెడ్డి పర్యటన

హైదరాబాద్, జూలై 29, 
హైదరాబాద్ వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి, బీజేపీ నేత జి.కిషన్ రెడ్డి పర్యటించారు. యూసుఫ్‌ గూడ, జూబ్లీహిల్స్‌, అంబర్‌పేటలో ప్రస్తుత పరిస్థితిని తెలియజేసి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించాలని ఆదేశించారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్‌ నేతృత్వంలోని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రకృతి వైపరీత్యాలను చురుగ్గా ఎదుర్కోవడంలో కేసీఆర్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ క్రమంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి హైదరాబాద్ లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు. తాను ప్రాతినిథ్యం వహిస్తున్న సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. యూసుఫ్ గూడ, జూబ్లీహిల్స్, అంబర్ పేటలో కిషన్ రెడ్డి పర్యటించారు. అధికారులతో మాట్లాడి మురుగు కాలువలు, ఇంకుడు గుంతలు పొంగిపొర్లడంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. వర్షాభావ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. కేవలం హైటెక్ సిటీ, పరిసర ప్రాంతాలపైనే ప్రభుత్వం దృష్టి సారిస్తోందని కిషన్ రెడ్డి విమర్శించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లోని పౌరసమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

మాటలే తప్ప   ప్రభుత్వ స్పందన ఉండదు
కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇళ్ళందకుంట మండలాల్లో ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పర్యటించారు. తెగిన రోడ్లు, బ్రిడ్జి, కల్వర్ట్లు పరిశీలించారు. జమ్మికుంట హౌసింగ్ బోర్డు, ఆంబేద్కర్ కాలనీల్లో ఇండ్లు నీట మునిగి న బాధితుల పరమార్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇండ్లు నీట మునిగిన బాధితుల పట్ల ప్రభుత్వ స్పందన కరువైందన్నారు. బాధితులను ఫంక్షన్ హాల్లో పెట్టి అన్నం పెట్టారని మండిపడ్డారు. పరిహారం మాత్రం దిక్కు లేదని అన్నారు. ఒక్కో బాధిత కుటుంబానికి రూ.25వేలు ఆందజేయాలని తెలిపారు. తెగిన రోడ్లు, చెరువులు, కల్వల ప్రాజెక్ట్ మరమ్మత్తులు చేపట్టాలని అన్నారు. చెరువుల కింద ఉన్న వ్యవసాయ భూములు కోతకు గురయ్యాయని అన్నారు. వ్యవసాయ భూములు తాటి చెట్టు అంత లోతు గొయ్యి పడ్డాయని తెలిపారు. ప్రభుత్వం మాటలు గొప్పగా ఉంటాయని, చేతల్లో మాత్రం ఏమి చెయ్యరని ఆగ్రహం వ్యక్తం చేశారు.వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు తెలంగాణ రాష్ట్రాన్ని అతలాకుతం చేశాయి. రాత్రి పగలు ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు వందలాది మంది నిరాశ్రయులు అయ్యారు. చెరువులు ఏరులై పారాయి. ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ఇళ్ల పైకప్పులపైకి ఎక్కి వరద ప్రవాహానికి వాగుల్లో కొట్టుకుపోయి పలువురు మృతి చెందిన సంఘటనలు రాష్ట్రంలో అనేకం. దీంతో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి హెలికాప్టర్ల సాయంతో బాధితులను రక్షించాయి. అక్కడక్కడా చెరువులు, వాగులు పొంగి పొర్లడంతో రహదారులు మూసుకుపోయాయి. దీంతో హైదరాబాద్-విజయవాడ హైవేతో పాటు రాష్ట్రంలోని పలు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమైంది. చాలా చోట్ల రోడ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. దీంతో వాహనాల్లో ప్రయాణించడం కష్టంగా మారింది. వర్షాలు తగ్గుముఖం పట్టినా జనజీవనం సాధారణ స్థితికి రావడానికి మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Related Posts