విజయవాడ, జూలై 29,
మేనల్లుడు, మేనమామ.. సాయి ధరమ్ తేజ్.. పవన్ కల్యాణ్ నటించిన బ్రో సినిమా శుక్రవారం రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బ్రో సినిమాలో తనపై వేసిన సెటైర్లపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తానేమీ పవన్ కల్యాణ్ లా ప్యాకేజీ తీసుకుని డ్యాన్స్ చేసే వ్యక్తిని కానంటూ పేర్కొన్నారు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు పనికిరారంటూ పేర్కొన్నారు. పవన్ తనను ఎదుర్కొలేకపోతున్నారని.. అందుకే సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ సృష్టించి శునకానందం పొందుతున్నారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. గెలిచినోడి డాన్స్ సంక్రాతి.. ఓడినోడి డాన్స్ కాళరాత్రి అంటూ విమర్శించారు. పవన్ తన డ్యాన్సులను విమర్శించే స్థాయికి దిగజారరంటూ పేర్కొన్నారు. కాగా.. సంక్రాంతి పండుగ వేడుకల్లో పాల్గొన్న మంత్రి అంబటి రాంబాబు అప్పట్లో డ్యాన్స్ వేసిన విషయం తెలిసిందే. అచ్చం అలానే బ్రో సినిమాలో పృధ్వీ రాజ్ క్యారెక్టర్ ను ప్రదర్శించారు. దీనిలో పృథ్వీ రాజ్ అచ్చం మంత్రి లానే, అలాంటి గెటప్ లోనే డ్యాన్స్ చేయగా.. దీనిపై అంబటి స్పందిస్తూ ఫైర్ అయ్యారు.కాగా.. పోలవరం ప్రాజెక్టు, సహా పలు ప్రాజెక్టులపై టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు అంబటి కౌంటర్ ఇచ్చారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు. కేంద్రం చేపట్టాల్సిన పోలవరం ప్రాజెక్టును అసలు ఎందుకు తీసుకున్నారో ఇప్పటికీ సమాధానం చెప్పలేదని అంబటి పేర్కొన్నారు.కేంద్రం వద్ద పాత అంచనాలకు అంగీకరించి తప్పు చేసింది చంద్రబాబు అన్నారు మంత్రి అంబటి. 2016లో ఒప్పందం చేసుకున్న టీడీపీ ప్రభుత్వం.. 2014 అంచనాలను ఎలా అంగీకరించారని ప్రశ్నించారు. ఇప్పుడు అనవసరమైన విషయాలను మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.2018లో పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. అసెంబ్లీలో చెప్పిన చంద్రబాబు, దేవినేని ఉమ సమాధానం చెప్పాలన్నారు. టీడీపీ ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్లే డయాఫ్రం వాల్ కొట్టుకుని పోయిందని.. దీంతో 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు ఆలస్యం అయిందన్నారు మంత్రి అంబటి.