YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

ప్రేమ పెళ్లిళ్లకు పేరంట్స్ అనుమతి తప్పనిసరి

ప్రేమ పెళ్లిళ్లకు పేరంట్స్ అనుమతి తప్పనిసరి

గాంధీనగర్, ఆగస్టు1,
ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రుల ఆమోదం కచ్చితంగా ఉండే విషయంపై అధ్యయనం చేస్తామని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. ఇలాంటి చట్టాన్ని తీసుకొస్తే.. మద్దతిస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే తెలిపారు. గుజరాత్లో ప్రేమ పెళ్లిళ్ల వ్యవహారం మరోమారు తెరపైకి వచ్చింది. ఈ విషయంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రేమ పెళ్లిళ్లకు తల్లిదండ్రుల ఆమోదం కచ్చితంగా ఉండే విధంగా.. రాజ్యాంగబద్ధంగా ఏదైనా వ్యవస్థను రూపొందించవచ్చా? అనే విషయంపై అధ్యయనం చేస్తామని పేర్కొన్నారు.గుజరాత్లో ఇటీవలి కాలం ప్రేమ వివాహాలు పెరుగుతున్నాయి. చాలా మంది ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లి చేసుకుంటున్నారు! ఈ నేపథ్యంలో.. ప్రేమ వివాహాలకు తల్లిదండ్రుల ఆమోదం ఉండేట్టుగా చర్యలు చేపట్టాలని పటీదారుల వర్గం నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ వ్యవహారం గత కొన్నాళ్లుగా సాగుతోంది. కాగా.. ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న భూపేంద్ర పటేల్.. ఈ విషయంపై స్పందించారు"పెద్దల ఆమోదం లేకుండా.. అమ్మాయిలు ఇంట్లో నుంచి వెళ్లిపోయి పెళ్లిళ్లు చేసుకోకుండా ఉండేందుకు ఏదైనా వ్యవస్థను రూపొందించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనిపై అధ్యయనం చేపడతాము. రాజ్యంగం మద్దతిస్తే.. ఈ విషయంపై అధ్యయనం చేపట్టి, మేము చేయగలిగినది చేస్తాము," అని భూపేంద్ర పటేల్ వెల్లడించారు.మరోవైపు సీఎం మాటలపై విపక్ష కాంగ్రెస్కు చెందిన ఓ ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు"ప్రేమ పెళ్లిళ్లల్లో తల్లిదండ్రులను పూర్తిగా పట్టించుకోకుండా ఉంటున్న రోజులివి. ఈ కాలంలో.. ఓ ప్రత్యేక వ్యవస్థను రూపొందించేందుకు, అది కూడా రాజ్యాంగబద్ధంగా ఉండే విధంగా చూసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇలాంటి చట్టాన్ని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రవేశపెడితే.. కచ్చితంగా మద్దతిస్తాను," అని ఇమ్రాన్ ఖేడావాలా అన్నారు. గుజరాత్ మతస్వేఛ్చ చట్టాన్ని 2021లో సవరించింది బీజేపీ ప్రభుత్వం. బలవంతంగా, పెళ్లి ద్వారా మతాన్ని మార్చేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు చేపట్టే విధంగా చట్టాన్ని సవరించింది. ఈ చట్టం కింద, దోషిగా తేలిన వారికి 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. అయితే.. ప్రభుత్వ నిర్ణయంపై గుజరాత్ హైకోర్టు స్టే విధించింది. దీనిని సవాలు చేస్తూ.. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రస్తుతం ఈ పిటిషన్.. సర్వోన్నత న్యాయస్థానంలో పెండింగ్లో ఉంది.

Related Posts