YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బోర్డుపై టమాటా ₹132 -అమ్మేది రూ 150 లు

బోర్డుపై టమాటా  ₹132 -అమ్మేది రూ 150 లు

నిత్యవసర ధరలతో పాటు కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో ప్రతి ఇంట ప్రతి  వంటలోను సహాయకంగా టమాటాను వాడటం పరిపాటి.దీంతో మార్కెట్లో ఎన్నడూ లేనివిధంగా టమోటా గత పది రోజుల క్రితం కేజీ ₹100 ఉండగా ప్రస్తుతం 132 రూపాయలకు చేరడంతో వినియోగదారులకు అందని ద్రాక్షగా మారింది.టమాటా కొనడానికి రైతు బజారుకి వచ్చి ఉన్న రేటుకు రేటుని చూసి కొనుగోలు చేద్దామనుకున్న వినియోగదారులకు కంగుతింటున్నారు.  ఉయ్యూరు రైతు బజార్లో కేజీ టమోటా ధర 132 రూపాయలు నిర్ణయించగా అధికారుల కళ్ళు గప్పి యదేచ్ఛగా 150 రూపాయలకు అమ్ముతూ వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు.  ఇదేమని ప్రశ్నిస్తే ఫిర్యాదు చేయండి చర్యలు తీసుకుంటామంటూ రైతు బజార్ ఎస్టేట్ అధికారులు సమాధానం ఇస్తున్నారు. వినియోగదారులకు రైతు బజార్ ఎస్టేట్ అధికారులు నిర్ణయించిన ధరల ప్రకారం కూరగాయలను ఆకుకూరలను ఇతర నిత్యావసరాలను అందించాల్సి ఉంటుంది. బోర్డు రేట్లపై  అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్న వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నారు అని గుసగుసలు వినిపిస్తున్నాయి.ఈ క్రమంలో  గా వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ 150 రూపాయలకు అమ్మకాలు చేశారు. దీనిపై పలువురు వినియోగదారులు వ్యాపారులను ప్రశ్నించగా... మేము అమ్మిన రేటుకి కొనాలని లేకుంటే వెళ్లిపోవాలని  పరుష పదజాలం తో సమాధానం ఇస్తున్నారు. రైతు బజార్లో అధిక ధరలకు టమోటాలను కొనుగోలు చేసిన వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
బయట మార్కెట్లో ఉన్న అధిక ధరలను నియంత్రించి  సరసమైన ధరల్లో ఆకుకూరలు అందించాలని వినియోగదాలకు  కూరగాయలను, కూరగాయలను అందించేందుకే రైతు బజార్లను ఏర్పాటు చేసింది. ఉన్నతాధికారుల   అలసత్వం తో రైతు బజార్ల ఎస్టేట్ అధికారులకు సిబ్బందికి కాసులు వర్షం కురిపిస్తున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు స్పందించి   పెరుగుతున్న అక్రమాలకు, దోపిడీ విధానానికి  అడ్డుకట్ట వెయ్యాలని కోరుతున్నారు.

Related Posts