YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

జలగానికి అధ్యక్ష చాన్స్ ఉందా

జలగానికి అధ్యక్ష చాన్స్ ఉందా

హైదరాబాద్, ఆగస్టు 2, 
కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు ఎన్నిక చెల్లదు అంటూ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుతో ఒక్కసారిగా ఖమ్మం రాజకీయాల్లో పెను దుమారం లేచిన విషయం తెలిసిందే బిఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన జలగం వెంకట్ రావును 2018 నుండి ఎమ్మెల్యేగా పరిగణించాలని కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో.. కోర్టు తీర్పు కాపీతో జలగం వెంకట్ రావు అసెంబ్లీ కార్యదర్శితో భేటీ అవ్వడం, అటు నుండి ఎన్నికల కమిషన్‌ని కలిసి నిర్ణయం తీసుకోమని కోరడం జరిగిన విషయమే. అటు వనమా వెంకటేశ్వర్ రావు తీర్పుపై స్టె ఇవ్వండిని, సుప్రీం కోర్టుకు వెళ్లాలని అని కోరడం.. దానికి హైకోర్టు నో చెప్పడం కూడా జరిగిపొయింది. ఈ నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరిలో ఎవరు అసెంబ్లీకి హాజరవుతారు? ఎన్నికల కమిషన్ ఏమంటుంది? స్పీకర్ ఈ రెండు రోజుల్లో ఏ నిర్ణయం తీసుకుంటారు? అనేది హాట్ టాపిక్ గా మారింది.కోర్టు నిర్ణయంపై ఇప్పటి వరకు అటు బిఆర్ఎస్ అదిష్టానము కూడా స్పందించలేదు. హై కోర్టు స్టె కు నిరాకరించడంతో తీర్పును అమలు చెయ్యక తప్పని పరిస్థితి వచ్చింది. కానీ స్పీకర్ తన విచక్షణ అధికారాలు ఉపయోగించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది సస్పెన్స్ గా మారింది. ఎందుకంటే.. అసెంబ్లీ సమావేశాలకు ఎవరు వెళ్ళాలి అన్నది తాజా మాజీల మధ్య సందిగ్దంగా మారింది. ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి ఘర్షణ వాతావరణానికి పోలేరు. అటు జలగం కూడా ప్రమాణ స్వీకారం చేసి చట్టసభల్లోకి అడుగుపెట్టాలి కాబట్టి స్పీకర్ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్టు సమాచారం. ఒక వేళ స్పీకర్ తన నిర్ణయాన్ని పెండింగ్‌లో పెడితే మాత్రం ఈసారి సభలకు వనమా కూడా హాజరుకాబోరని తెలుస్తుంది

Related Posts