స్మగ్లర్లు అక్రమ రవాణా కు వ్యవసాయ పొలాలు సైతం ఉపయోగించుకుంటున్నారు. ఈ విషయం శనివారం ఉదయం టాస్క్ ఫోర్స్ కూంబింగ్ లో బయటపడింది. ఆర్ఐ భాస్కర్ బృందం చీకటీగలకోన ప్రాంతం నుండి సుమారు 15 మంది ఎర్రచందన స్మగ్లర్లు వెళ్తున్నారని అందిన విశ్వసనీయ సామాచారంతో అప్పటికే టాస్క్ ఫోర్స్ పార్టీలు అన్ని రోడ్లు మార్గాలను బ్లాక్ చేయటంతొ చేసేది లేక స్మగ్లర్లు ఎర్రగుట్ట ప్రాంతంలోకి వెళ్లిపోయారు.
మరింత క్షుణ్ణంగా పరిశీలించగా రోడ్డు కు ఆనుకును ఉన్న నీటి వంకలోని దట్టమైన పొదలలో దాచిన 12 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులను చూసి చెరుకు తోటలో పనిచేస్తున్నట్టు నటించారు, కాని పోలీసులు వారిపై అనుమానంతో పట్టుకునే ప్రయత్నం చేస్తుండగా స్మగ్లర్లు రాళ్ళ విసిరి అటవీ ప్రాంతంలోకి పారిపోయారు. వారికోసం టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు.