YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఏపీలో పంచాయితీలకు రేటింగ్స్

ఏపీలో పంచాయితీలకు రేటింగ్స్

గ్రామ పంచాయతీల అభివృద్ధిని ప్రభుత్వం స్టార్‌ రేటింగ్స్‌తో సూచిస్తోంది. పంచాయతీల మధ్య స్నేహపూర్వక పోటీ పెంచేందుకు 11 అంశాల్లో సాధించిన పురోగతి ఆధారంగా స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. 11 స్టార్‌లు సాధించిన గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించి సముచిత రీతిలో ప్రభుత్వం గౌరవిస్తుంది. దశల వారీగా అన్ని గ్రామ పంచాయతీల్లో మిషన్‌ అంత్యోదయ కార్యక్రమంలో భాగంగా 2019 అక్టోబరు 2 నాటికి ఆదర్శ గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నిస్తున్నారు.గ్రామాలు ఏ మేరకు అభివృద్ధి సాధించాయో స్టార్‌ల రూపంలో ప్రభుత్వం రేటింగ్‌ ఇస్తోంది. కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వల నుంచి నిధులు విడుదల అవుతున్నా, క్షేత స్థాయిలో ఆశించిన మేర అభివృద్ధి కనిపించడం లేదని ప్రభుత్వం పంచాయతీలకు గ్రేడింగ్‌ విధానం ప్రవేశపెట్టింది. ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి, భవిష్యత్తులో చేపట్టబోయే కార్యాచరణ అంశాలపై ఈ రేటింగ్‌ విధానం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు.కానీ వాస్తవ పరిస్థితులకు, వచ్చిన రేటింగ్స్‌కు ఏ మాత్రం పొంతన ఉండట్లేదు. వివిధ శాఖల అనుసంధానం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధిని వేగవంతం చేసి, మౌలిక వసతులను కల్పించాల్సిన ప్రభుత్వం స్టార్‌ రేటింగ్స్‌ అంటూ మభ్యపెడుతోంది. ఇప్పటికే గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ల అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. జన్మభూమి కమిటీలకు అధికారాలను కట్టబెట్టి పంచాయతీ రాజ్‌ వ్యవస్థను నిర్వీర్యం చేస్తోంది. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల ఎంపిక అంతా టీడీపీ వారి కనుసన్నల్లోనే జరుగుతుండటంతో సర్పంచ్‌లు ఉత్సవ విగ్రహాలుగా మారుతున్నారు. ఫలితంగా గ్రామాల్లో అభివృద్ధి కుంటుపడుతోంది.

ఓపెన్‌ డెఫకేషన్‌ ఫ్రీ గ్రామంగా ఉండాలి

ప్రతి ఇంటికి విద్యుత్‌ సౌకర్యం, గ్రామాల్లో వీధి దీపాలు ఎల్‌ఈడీలుగా మార్పు

ప్రతి ఇంటికి గ్యాస్‌ కనెక్షన్‌ ఉండాలి

సురక్షిత తాగునీరు అందాలి, ప్రతి ఇంటికి వ్యక్తిగత కుళాయి కనెక్షన్‌

పారిశుద్ధ్యాన్ని మొరుగుపరిచేందుకు ఘన, వ్యర్థాల నిర్వహణ, చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాల ఏర్పాటు

ప్రయాణాలకు అనువైన రహదారులు, అంతర్గత సీసీ రోడ్లు, అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్ల నిర్మాణం

కో నాలెడ్జ్‌ సొసైటీగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఇంటికి పైబర్‌ నెట్‌  

ప్రతి పేద మహిళ పొదుపు సంఘంలో ఉండేలా చూడటం. వారికి నైపుణ్యాభివృద్ధిలో శిక్షణ ఇచ్చి ఆదాయ వనరులు చూపించాలి.

బడిఈడు పిల్లలందరూ పాఠశాలకు హాజరు కావడం, అన్ని పాఠశాలల్లో మరుగుదొడ్లు, తాగునీరు, ఫర్నీచర్, ఫైబర్‌ నెట్‌ ఏర్పాటు

చిన్నారులకు వంద శాతం వ్యాధి నిరోధక టీకాలు, వంద శాతం ఆస్పత్రి ప్రసవాలు, వంద శాతం పోషకాహారం అందాలి.

మహిళల ఆర్థిక, సామాజిక, రాజకీయ సాధికారితకు కృషి. లింగ సమానత్వం, గృహ హింస రహిత గ్రామాలు

Related Posts