YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

సింధటిక్ వేలిముద్రతో పెన్షన్లు స్వాహా

సింధటిక్ వేలిముద్రతో పెన్షన్లు స్వాహా

ఒంగోలు, ఆగస్టు3, 
ఓ వైపు వాలంటీర్ల వ్యవహారంపై రాజకీయ దుమారం రేగుతుంటే మరో వైపు వాలంటీర్లు చేస్తున్న తప్పుడు పనులు చర్చనీయాంశంగా మారుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఓ వాలంటీర్ బెంగుళూరులో ఉంటూ తన వేలిముద్రకు నకిలీ చేయించి పెన్షన్లు పంపిణీ చేస్తుండటం వెలుగు చూసింది.నకిలీ వేలిముద్రతో వృద్ధులకు పింఛన్లు పంపిణీ చేస్తున్న వ్యవహారం ప్రకాశం జిల్లాలో వెలుగు చూసింది. ప్రకాశం జిల్లా పడమట కట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లికి చెందిన రాచగొర్ల ప్రసాద్‌ వలంటీర్‌గా పనిచేస్తున్నారు. క్లస్టర్ పరిధిలో 18 సామాజిక పింఛన్లను వాలంటీర్‌ ప్రసాద్ పంపిణీ చేయాల్సి ఉంది. కొంతకాలంగా ప్రసాద్‌ బెంగళూరులో ఉంటూ అప్పడప్పుడు గ్రామానికి వచ్చి పోతున్నారు.రెండు నెలల క్రితం తన బొటన వేలితో డూప్లికేట్‌ వేలిముద్రను రూపొందించారు. దానిని కుటుంబ సభ్యులకు ఇచ్చాడు. నకిలి వేలిముద్రతో వలంటీర్‌ పోర్టల్‌లో లాగిన్‌ చేయించి క్లస్టర్‌ పరిధిలో లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేయిస్తున్నాడు. ఈ క్రమంలో వాలంటీర్ కుటుంబీకులు లబ్ధిదారులను తన ఇంటికే పిలిపించుకుని సొమ్ము అందచేస్తున్నారు.ఈ వ్యవహారంపై మంగళవారం కొందరు గ్రామస్థులు.. సచివాలయ కార్యదర్శి జానీకి ఫిర్యాదు చేశారు. కార్యదర్శి వలంటీర్‌ ఇంటికి వెళ్లి తనిఖీచేశారు. అప్పటికే ఒకరిద్దరికి నకిలీ వేలి ముద్రతో పింఛన్‌ సొమ్ము ఇచ్చినట్టు గుర్తించారు. వలంటీర్‌ లేకుండా పింఛను ఎలా ఇస్తున్నారని ప్రశ్నించడంతో విషయం వెలుగు చూసింది. దీంతో కార్యదర్శి విషయాన్ని ఎంపీడీవోకు తెలిపారు. ఎంపీడీవో ఆదేశాలతో అక్కడ ఉన్న రూ.55 వేల పింఛన్ల మొత్తాన్ని కార్యదర్శి స్వాధీనం చేసుకున్నారు.పామూరు మండలం పడమటికట్టకిందపల్లి పంచాయతీ పరిధిలోని కందులవారిపల్లిలో వాలంటీర్‌గా పనిచేస్తున్న రాచగొర్ల గురుప్రసాద్‌ గ్రామంలో అందుబాటులో ఉండకుండా బెంగళూరులో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. పెన్షన్ మొత్తాన్ని వాలంటీర్‌కు బదులు ఆయన సోదరుడు గురుస్వామి పంపిణీ చేసినట్లు లబ్ధిదారులు తెలిపారు.బయోమెట్రిక్‌ యంత్రంలో గురుప్రసాద్‌ సింథటిక్ వేలిముద్ర వేయడం గుర్తించి సచివాలయ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కొందరికే మాత్రమే పింఛను నగదును ఇచ్చి మిగిలిన లబ్ధిదారులకు ఇవ్వకపోవడంతో వారు సచివాలయానికి వెళ్లి పంచాయతీ కార్యదర్శి షేక్‌ జానికి ఫిర్యాదు చేశారు. లబ్దిదారుల ఇళ్లను జియోఫెన్సింగ్ చేసి గుర్తించినా ఎలా పంపిణీ చేయగలిగారనే దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts