YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

సిట్ఠింగ్ లకు ఫిట్టింగ్ లు పావులు కదుపుతున్న నేతలు

సిట్ఠింగ్ లకు ఫిట్టింగ్ లు పావులు కదుపుతున్న నేతలు

నల్గోండ, ఆగస్టు 3, 
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. దీంతో టికెట్ ఆశిస్తున్న నేతలు… ఎవరికి వారిగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు. సిట్ఠింగ్ లకు ఫిట్టింగ్ పెట్టేలా కొందరు నేతలు పావులు కదుపుతున్నారు. ఇదే సీన్ యాదాద్రి జిల్లాలోని ఆలేరులో కనిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ప్రధాన పార్టీలన్నీ గెలుపు గుర్రాలపై ఫోకస్ పెట్టాయి. మొన్నటి వరకు ఆపరేషన్ ఆకర్ష్ తో కాంగ్రెస్ దూకుడు పెంచితే... ఇక మా వంతు అన్నట్లు బీఆర్ఎస్ కూడా షురూ చేసింది. కీలక నేతలతో టచ్ లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రధాన ప్రత్యర్థి పార్టీల్లో అలజడి మొదలైందన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. త్వరలోనే చాలా సమీకరణాలు మారే ఛాన్స్ కనిపిస్తోంది. ఇక సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామంటూ పలుమార్లు ప్రకటనలు చేసిన గులాబీ బాస్ కేసీఆర్... చాలా మందికి హ్యాండ్ ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే 25 నుంచి 30 మంది ఎమ్మెల్యేల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు కూడా టికెట్లు ఆశిస్తుండటంతో... పలు నియోజకవర్గాల్లో గట్టి పోటీ నెలకొంది. ఇదే జాబితాలోకి వస్తోంది యాదాద్రి జిల్లాలోని ఆలేరు నియోజకవర్గం. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ్నుంచి బీఆర్ఎస్ తరపున ఎవరు పోటీ చేస్తారనేది టాక్ ఆఫ్ ది ఆలేరుగా మారింది.రాష్ట్ర ఏర్పాటు కంటే ముందు ఆలేరులో కాంగ్రెస్ హవా నడిచేది. ఇక్కడ్నుంచి 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా బూడిద భిక్షమయ్య గౌడ్ గెలిచారు. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో ఇక్కడ గులాబీ జెండా ఎగిరింది. గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి చేతిలో భిక్షమయ్య గౌడ్ ఓటమి చవిచూశారు. 2018 ఎన్నికల్లోనూ గొండిడి సునీతా మరోసారి విజయాన్ని అందుకున్నారు. ఈ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన భిక్షమయ్య గౌడ్ ఓటమి పాలయ్యారు. 33వేల ఓట్లకు పై మెజార్టీతో గులాబీ జెండా రెపరెపలాడింది. ఆ తర్వాత నియోజకవర్గంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ కేడర్ బీఆర్ఎస్ లోకి జంప్ అయింది. ఈ క్రమంలోనే... భిక్షమయ్య గౌడ్ కూడా కారెక్కారు. దీంతో గొంగిడి, భిక్షమయ్య గౌడ్ వర్గం అన్నట్లు తయ్యారైంది. కట్ చేస్తే... ఇంతలోనే కారు పార్టీకి షాక్ ఇస్తూ కమలం గూటికి చేరారు భిక్షమయ్య గౌడ్. అక్కడ ఎక్కువ కాలంపాటు ఉండలేకపోయారు. మునుగోడు బైపోల్ సందర్భంగా... మళ్లీ గులాబీ శిబిరంలోకి వచ్చేశారు. ప్రస్తుతం పార్టీలో యాక్టివ్ గా తిరుగుతున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ... వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అన్న సంకేతం ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.భిక్షమయ్య గౌడ్ కు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం ఇస్తారనే చర్చ గట్టిగా వినిపిస్తోంది. కానీ అలా జరగలేదు. అయితే ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా ఓ వైపు నుంచి తెరపైకి వస్తున్నాయి. ఆ కారణంతోనే ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వలేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు మరికొద్దిరోజుల్లోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ.... మరోసారి పార్టీ టికెట్ పై పోటీ చేసి హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డి భావిస్తున్నారు. ఈసారి కూడా తనకే టికెట్ వస్తుందని గట్టిగా విశ్వసిస్తున్నారు.తాజా పరిస్థితుల నేపథ్యంలో.... బీఆర్ఎస్ అధినాయకత్వం సిట్టింగ్ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర్ రెడ్డికే మరోసారి ఛాన్స్ ఇస్తుందా...? లేక భిక్షమయ్య గౌడ్ వైపు చూస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది. కట్ చేస్తే వీరిద్దరి పేర్లే కాకుండా... కొత్తగా ఫైళ్ల శేఖర్ రెడ్డి పేరు కూడా తెరపైకి వస్తోంది. భువనగిరి టికెట్ ను కుంభం అనిల్ కుమార్ రెడ్డికి ఇచ్చి... ఆలేరు శేఖర్ రెడ్డికి ఇస్తారనే టాక్ కూడా మొదలైంది. వీరే కాకుండా... మాజీ మంత్రి మోత్కుపల్లి కూడా పోటీకి రెడీ అంటున్నారు. మొత్తంగా ఆలేరు సీటు నుంచి ఎవరు పోటీ చేస్తారనేది మాత్రం బీఆర్ఎస్ లోనే కాదు ప్రత్యర్థి శిబిరంలోనూ ఆసక్తిని రేపుతోంది.

Related Posts