విజయవాడ
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి వేడుకలు అట్టహాసంగా జరు గుతున్నాయి. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉద యం 3 గంటల నుండి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పించారు.అమ్మవారిని దర్శించుకునేం దుకు భక్తులు పెద్ద ఎత్తున ఇంద్రకీలాద్రి క్యూ లైన్ ల ద్వారా చేరుకుంటున్నారు.ఎడమ చేతిలో బంగారు అక్షయ పాత్ర, కుడి చేతులో వజ్రాలతో కూడిన గరిట, పక్కన పరమేశ్వరుడు ఆది బిక్షువుడిగా పాత్రతో ధరించి ప్రకాశిస్తుం డగా అమ్మవారు భక్తులకు దర్శన మిస్తున్నారు. పరమేశ్వరుడు సాక్షాత్ ఆది బిక్షుడిగా అమ్మవారి ముం దు పాత్రను పట్టి బిక్ష చేస్తుండగా అమృత అన్నాహారాన్ని, అమ్మవారి అనుగ్రహం మనం కూడా పొంద డం, అన్నప్రసాదాన్ని స్వీకరించడం వల్ల జ్ఞానం, వైరాగ్యాన్ని పొందగలిగే శక్తి లభిస్తుందనీ భక్తు ల నమ్మకం. లోకంలో ఎవరికి ఆకలి వేసినా, దప్పిక వేసినా తీర్చే స్వరూపమే అన్నపూర్ణాదేవి స్వరూపం. ఆజన్మాంతం అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరు తూ భక్తులు అమ్మవారిని పెద్ద ఎత్తున దర్శిం చుకుంటు న్నారు