న్యూఢిల్లీ అక్టోబర్ 17
భారతీయ వ్యోమగామిని 2040లోగా చంద్రుడి మీదకు పంపేందుకు ప్రణాళికలు రూపొందించాలని శాస్త్రవేత్తలను ప్రధాని మోదీ కోరినట్లు తెలుస్తోంది. 2035లోగా భారతీయ స్పేస్ స్టేషన్‌ను నిర్మించాలని కూడా ఆయన శాస్త్రవేత్తలను కోరినట్లు ఓ ప్రకటన ద్వారా వెల్లడైంది. గగన్‌యాన్ మిషన్ సంసిద్ధతపై రివ్యూ మీటింగ్ జరిగిన సమయంలో ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. అక్టోబర్ 21వ తేదీన ఉదయం ఏడు గంటలకు శ్రీహరికోట నుంచి గగన్‌యాన్ మిషన్‌కు చెందిన మాడ్యూల్‌ను పరీక్షించనున్నారు. భవిష్యత్తు రోదసి కార్యక్రమాల గురించి ప్రధాని మోదీ ఆ సమావేశంలో దిశానిర్దేశం చేశారు. వీనస్ ఆర్బిటార్ మిషన్, మార్స్ ల్యాండర్ గురించి ఆ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది. 2035లో భారతీయ అంతరిక్ష స్టేషన్ ఏర్పాటు చేయాలని, 2040లోగా చంద్రుడి మీదకు భారతీయ వ్యక్తిని పంపాలని, దీనికి సంబంధించిన కార్యాచరణను అంతరిక్ష శాఖ డెవలప్ చేస్తుందని ప్రధాని తెలిపారు.