YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు

బీఆర్ఎస్ ఎన్నికల కోడ్ ఉల్లంఘన పై రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు

జగిత్యాల
బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎన్నికల కోడ్ ను ఇష్టారీతిన ఉల్లంఘిస్తున్నారని, అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు గోడలపై నినాదాలు రాస్తున్నారని కాంగ్రెస్ నాయకులు జిల్లా రిటర్నింగ్ అధికారికి మంగళవారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.
జగిత్యాల పట్టణంలో ప్రధాన కూడళ్లలో ఎమ్మెల్సీ కవిత బతుకమ్మ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఎటువంటి అనుమతులు లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు, ఇంటి యజమానుల అనుమతులు తీసుకోకుండా గోడలపై బీఆర్ఎస్ పార్టీ నినాదాలు రాస్తున్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు తీసుకోవాలని పిసిసి ప్రచార కార్యదర్శిలు గిరి నాగభూషణం, బండ శంకర్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదులో పేర్కొన్నారు.
తక్షణమే స్పందించిన రిటర్నింగ్ అధికారి అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను కిందిస్థాయి సిబ్బందితో తొలగించి వేశారు. ఎన్నికల ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలని అనుసరించాలని అధికారులు సూచించారు....ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు దుర్గయ్య,గుండా మధు,మన్సూర్,శేఖర్,జీవన్,గుంటి జగధ్వీర్, మహిపల్, శ్రీనాధ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related Posts