YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేటీఆర్ క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేటీఆర్ క్షమాపణ చెప్పాలి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్
గ్యాస్ సిలిండర్ కి కాంగ్రెస్ 5వందలు అంటే కేసీఆర్ ఇప్పుడు 4వందలు అంటున్నారు. 10పదేళ్లుగా ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ కు ఎందుకు ఆలోచన రాలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100రోజుల్లోనే 6గ్యారంటీ స్కిమ్స్ అమలు అవుతాయి. కాంగ్రెస్ పథకాలను కేసీఆర్ కాపీ కొట్టారు. హరీష్ రావు, కేటీఆర్ తప్ప ఎవరైనా మంత్రులు వాళ్ళ సెగ్మెంట్ దాటుతున్నారా? మంత్రులు అంతా డమ్మీలు అయ్యారు. రాష్ట్రంలో అమ్మాయిల ఆత్మహత్యలు దురదృష్టకరం. ప్రవళిక, ప్రీతీ ఘటనలు బాధాకరం. కేటీఆర్ అధికారం అడ్డుపెట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నారు.
ప్రవల్లిక విషయంలో కేటీఆర్ విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి. చనిపోయిన అమ్మాయి పై అభాండాలు ప్రభుత్వం వేస్తోంది. కేసీఆర్ చీకటి పరిపాలన 45రోజుల్లో మునిగిపోతుంది. డిసెంబర్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది. కాంగ్రెస్ నాయకులకు పదవుల కోసం ప్రభుత్వం కాదు.. ప్రజలకు న్యాయం కోసం రాబోతోందని అన్నారు. వైఎస్సార్ ఫీజు రియాంబర్స్ మెంట్ ఇచ్చి ఉచిత చదువు విద్యార్థులకు అందించారు. వైఎస్సార్ ఫీజు రియాంబర్స్ మెంట్ ఇప్పుడు బంద్ అయిపోయిందని అన్నారు.

Related Posts