ధనాధన్ క్రికెట్లో ఆఖరి ఘట్టం. మరికొన్ని గంటల్లో ఐపీఎల్-11 కిరీటం ఎవరిదో తేలిపోనుంది.చేజింగ్‌లో దుమ్ము రేపే జట్టు ఓ వైపు.. బౌలింగ్ బలగంతో ఎలాంటి స్కోరునైనా కాపాడుకునే జట్టు మరో వైపు. తొమ్మిదేళ్ల ప్రస్థానంలో ఏకంగా ఏడుసార్లు ఫైనల్ చేరిన చెన్నై సూపర్ కింగ్స్‌తో ఆరేళ్ల అనుభవం కలిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ టైటిల్ కోసం పోటీపడుతోంది.
జట్లు: (అంచనా)
సన్‌రైజర్స్: ధవన్, సాహా, విలియమ్సన్ (కెప్టెన్), షకీబల్, దీపక్ హుడా/మనీష్ పాండే, యూసుఫ్ పఠాన్, బ్రాత్‌వైట్, రషీద్ ఖాన్, భువనేశ్వర్, సిద్ధార్థ్ కౌల్, సందీప్/ఖలీల్.
చెన్నై: వాట్సన్, డుప్లెసిస్, రైనా, రాయుడు, ధోనీ (కెప్టెన్), బ్రావో, జడేజా, చాహర్, హర్భజన్, ఠాకూర్, ఎన్‌గిడి.