YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

కేసీఆర్ అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదు రాహుల్ గాంధీ

కేసీఆర్ అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడంలేదు రాహుల్ గాంధీ

భూపాలపల్లి
రెండవరోజు భూపాలపల్లి నుంచి కాంగ్రెస్ విజయభేరి యాత్ర ప్రారంభమయింది. ఈ యాత్రలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, మధుయాష్కీ, పొంగులేటి,  ఇతర నేతలు పాల్గోన్నారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ
కేసీఆర్ అవినీతిపై ఎందుకు దర్యాప్తు చేయడం లేదని బీజేపీని ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతిపై ఈడీ, సీబీఐ ఎందుకు ఫోకస్ పెట్టలేదని ఆయన అడిగారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ప్రజలకే పంచుతామని అన్నారు. ఉదయం భూపాలపల్లి నుండి కాటారం వరకు బస్సులో రాహుల్ గాంధీ చేరుకున్నారు. ఈ సందర్బంగా రాహుల్ మాట్లాడుతూ, కేసీఆర్ తన అవినీతిని పక్క రాష్ట్రాలకు కూడ విస్తరించారని  ఆరోపించారు. దేశంలోనే అవినీతి ప్రభుత్వం తెలంగాణలో అన్నారు. కేసీఆర్ సర్కార్ అవినీతి కారణంగా ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న కేసీఆర్ పై ఎలాంటి చర్యలు లేవన్నారు. యాత్ర గురువారం నాడు కాటారం,  కొయ్యూరు, మంథని మీదుగా పెద్దపల్లి వరకు కొనసాగింది. 

Related Posts