నువ్వా నేనా అనే విధంగా బద్వేలు రాజకీయాలు గతంలో కంటే రసవత్తరంగా మారిన రాజకీయం వైకాపా తరపున పోటా పోటీ గా ప్రయత్నాలు ఈసారి జరిగే ఎన్నికలు ఆశమాషి కాదు విజయమే లక్ష్యంగా వైకాపా తెలుగుదేశం గెలుపు ఏ పార్టీకి అంత సులువు కాదు !
బద్వేలు
రసవత్తరంగా మారిన బద్వేలు నియోజకవర్గ రాజకీయం ఇప్పుడు నువ్వా నేనా అనే విధంగా ఉంది అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రధాన పార్టీలు నువ్వా నేనా అనే విధంగా పోరుకు సిద్ధమవుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల పరిధిలో అభ్యర్థులు ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధాన పోటీ మాత్రం తెలుగుదేశం వైకాపా మధ్యనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన నిజం. ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని తెలుగుదేశం పార్టీ బాగా కష్టపడుతుంది. పట్టు నిలుపుకేలెందుకు వైకాపా ప్రయత్నిస్తుంది. బద్వేల్ అసెంబ్లీ రిజర్వు అయిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక్కసారి కూడా విజయం సాధించలేదు. దివంగత మంత్రి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తండ్రి వీరారెడ్డి జీవించి ఉన్నంతకాలం బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా నిలిపారు. ఆయన మృతి చెందిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన కూతురు విజయమ్మ ఆ ఎన్నికల్లో మాత్రం 19 వేల ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆ తరువాత తెలుగుదేశం పార్టీకి విజయమంటూ దక్కలేదు. 20 సంవత్సరాల క్రితం రాజకీయ ప్రవేశం చేసిన డిసి గోవింద్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత బద్వేల్ అసెంబ్లీ రిజర్వు అయింది. ప్రతి ఎన్నికల్లోనూ ప్రస్తుత వైకాపా ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి బలపరిచిన అభ్యర్థులే విజయం సాధిస్తూ వస్తున్నారు. తాజాగా జరిగిన బద్వేలు ఉప ఎన్నికల్లో సైతం వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సుధా భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఆమె విజయం వెనుక గోవింద్ రెడ్డి ఉన్నాడు అనే విషయం అందరికీ తెలిసిందే.
త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం వైకాపా పార్టీల తరఫున పోటీ చేసేందుకు పలువురు క్యూ కడుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన ఒక అధికారి టికెట్ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆదికారికే బద్వేలు అసెంబ్లీ టికెట్ అని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ నర్మగర్భంగా చెప్పడం జరిగింది. నీటిపారుదల శాఖలో పనిచేస్తున్న పోరుమామిళ్ల ప్రాంతానికి చెందిన రోశయ్య తెలుగుదేశం అభ్యర్థి అని మాజీ ఎమ్మెల్యే చెప్పకనే చెప్పారు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ విజయమ్మ ఆమె కుమారుడు పార్టీ యువ నేత రితేష్ కుమార్ రెడ్డి పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి మరికొందరు ముఖ్య నేతలు కలిసి వారి మద్దతు కోరారు. వారి ఆశీస్సులు కూడా ఆయనకు లభించాయి. బద్వేలు పోరుమామిళ్ల కలసపాడు కాశి నాయన బి కోడూరు మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు రోశయ్యకు పూర్తిగా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జైల్లో ఉండకపోతే రోశయ్య పేరు ఎప్పుడో అధికారికంగా ప్రకటించేవారు. జరిగే ఎన్నికల్లో కొత్తవారికి అసెంబ్లీ టికెట్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు గతంలోనే అనధికారికంగా ప్రకటించారు. ఆ అధికారితోపాటు ఇంకా పలువురు తెలుగుదేశం రోశయ్య ఇప్పటికే తన ఉద్యోగానికి రాజీనామా చేయడం దానికి ప్రభుత్వం ఆమోదం తెలపడం జరిగిపోయాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ ఉంది. ఈ విషయాన్ని రాజకీయ పరిశీలకులు తేల్చి చెబుతున్నారు. మరో 4 నెలల్లో అసెంబ్లీకి ఎన్నికలు వచ్చే తరుణం ఆసన్నమైంది. ముందస్తు ఎన్నికలు వచ్చిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదని అన్ని పార్టీల వారు మరి మరి చెబుతున్నారు.
ఎన్నికలసమయం దగ్గర పడుతుండడంతో బద్వేల్ అసెంబ్లీ రాజకీయాలు కాక రేపుతున్నాయి. నువ్వా నేనా అన్న రీతిలో తెలుగుదేశం వైకాపా పార్టీలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిశీలన చేస్తున్నారు. ప్రధానంగా తెలుగుదేశం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మధ్య ప్రధాన పోటీ ఉంటుంది.
తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే విజయమ్మ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీగోవింద్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉంటూ పార్టీలను నడిపిస్తున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పుడు నుండి ఎమ్మెల్సీ గోవింద్ రెడ్డి పెద్దదిక్కుగా ఆ పార్టీకి ఉన్నారు. గోవింద్ రెడ్డి చెప్పిన వారికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ టికెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఇక మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తెలుగుదేశం పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఆమె తండ్రి దివంగత మంత్రి వీరారెడ్డి మృతి చెందిన తర్వాత ఆమె రాజకీయ రంగప్రవేశం చేశారు. ఉప ఎన్నికల్లో పోటీ చేసి తెలుగుదేశం ఎమ్మెల్యేగా 19 వేలకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో విజయమ్మ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించలేకపోయారు. అప్పట్లో కాంగ్రెస్ అభ్యర్థిగా గోవింద్ రెడ్డి పొడిచేసి విజయం పొందారు. ఆ తర్వాత బద్వేల్ అసెంబ్లీ రిజర్వు అయింది. రిజర్వ్ అయిన తర్వాత జరిగిన 4 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించలేక పోయింది. దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బద్వేల్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ టికెట్ కమలమ్మకు ఇచ్చారు. అప్పటి ఎమ్మెల్యే గోవింద్ రెడ్డి సిఫారసు తో కమలమ్మకు కాంగ్రెస్ పార్టీ టికెట్ వచ్చింది. ఆ తర్వాత ఎన్నికల్లో కమలమ్మ మంచి మెజార్టీతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన మూడు ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా జయ రాములు వెంకటసుబ్బయ్య పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత బద్వేలు ఉప ఎన్నికల్లో డాక్టర్ సుధా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి దాదాపు లక్ష ఓట్లకు పైగా మెజార్టీతో విజయం సాధించారు. ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయలేదు. ఇది కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చింది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బద్వేల్ లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగురవేస్తామని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ధీమాగా చెబుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వైపల్లాలు ప్రజల్లో ఆ పార్టీపై పెరుగుతున్న వ్యతిరేకత తెలుగుదేశం పార్టీపై పెరుగుతున్న ఎక్కడికి నమ్మకం చంద్రబాబు నాయుడు పై ప్రజలకున్న విశ్వాసం తమ పార్టీ గెలుపుకు డోకా లేదని వారంటున్నారు.
అలాగే ఇటీవల బద్వేలు నియోజకవర్గంలో నారా లోకేష్ జరిపిన పాదయాత్ర పార్టీకి బాగా కలిసి వచ్చిందని వారు అంటున్నారు. పార్టీ టికెట్ కోసం పలువురు పోటీ పడుతున్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెబుతున్నారు. మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆమె తనయుడు పార్టీ యువనేత రితేష్ కుమార్ రెడ్డి చెప్పినవారికి కచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు టికెట్ ఇస్తారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈసారి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా కొత్తవారు రంగంలో ఉంటారని ఆ పార్టీ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి. ముఖ్య నేత కూడా ఇదే విషయాన్ని ఇప్పటికే కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధినాయకత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమాన్ని బద్వేల్ నియోజకవర్గంలో విజయవంతం చేస్తున్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాగా వైకాపా పార్టీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై పూర్తి భరోసా పెట్టుకుంది రాజకీయాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు ఆ నాయకులు ఎంతో దిమాగా ఉన్నారు. సంక్షేమ పథకాలే తమ పార్టీకి శ్రీరామరక్ష అని వారు అంటున్నారు. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో వైకాపా పార్టీకి బలమైన నాయకులు కార్యకర్తలు ఉన్నారు. ఈ విషయంలో ఏ మాత్రం అనుమానం అక్కర్లేదు.