రాజమండ్రి, అక్టోబరు 20,
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నలభై రోజులుగా జైల్లో ఉన్నారు. క్వాష్ పిటిషన్ తీర్పు ఎలా వస్తుందో తెలియదు. అనుకూలంగా వస్తే ఆయన వెంటనే బయటకు వస్తారు. వ్యతిరేకంగా వస్తే.. మళ్లీ బెయిల్ పిటిషన్లు వేసుకుని పోరాడాలి. ప్రస్తుత పరిస్థితి చూస్తే దేనికైనా సుప్రీంకోర్టు వరకూ ప్రయత్నించాల్సి ఉంటుందని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. క్వాష్ పిటిషన్ వ్యతిరేకంగా వస్తే చంద్రబాబు బయటకు రావడానికి మరింత సమయం పడుతుంది. ఈ నలభై రోజులుగా టీడీపీ చంద్రబాబు అరెస్టులు, కేసుల వ్యవహారాలతోనే సమయం గడిపేసింది. లోకేష్ కూడా ఎక్కువగా ఢిల్లీలోనే కాలం గడిపారు. కానీ చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ఏపీలో ఎటు చూసినా టీడీపీ కనిపించేది. విస్తృతంగా నేతలు పర్యటించేవారు. ఇప్పుడు కూడా టీడీపీ నేతలు విస్తృతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు కానీ భిన్నమైన కారణంతో చంద్రబాబు అరెస్టుకు ముందు తెలుగుదేశం పార్టీ విస్తృత కార్యాచరణ ప్రకటించుకుంది. దసరాకు మేనిఫెస్టో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఇప్పటికే గ్యారంటీ హామీలను కూడా ప్రకటించారు. అయితే కర్నూలులోల చంద్రబాబును రాజకీయ పర్యటనలో ఉన్నప్పుడే అరెస్టు చేశారు. ఎన్నికలకు ఆరేడు నెలల ముందే ఏపీలో ఎటు వైపు చూసినా తెలుగుదేశం పార్టీ జెండాలు కనిపించేలా ప్రచార ప్రణాళికను చంద్రబాబు ప్లాన్ చేసుకుని అమలు చేస్తున్నారు. మినీ మేనిపెస్టోను ప్రకటించి.. పార్టీ నేతలందర్నీ ఇంటింటికి పంపారు. అయితే ఇది ఆరంభమేనని.. ముందు ముందు అసలు ప్రచార భేరీ ఉందని చెబుతున్నారు. వచ్చే ఎనిమిది నెలల పాటు టీడీపీ క్యాడర్ అంతా.. ఓటర్లను అంటిపెట్టుకుని ఉండేలా కార్యక్రమాలను ఖరారు చేసి.. నిర్వహణ కోసం ప్రత్యేక వ్యవస్థనూ ఏర్పాటు చేసుకున్నారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ , ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటూ.. . ఒక దాని తర్వాత ఒకటి కాకుండా.. ఒకటి కొనసాగుతూండాగనే మరో ప్రచార కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు. అయితే చంద్రబాబును అరెస్టు చేయడంతో అన్ని ఆగిపోయాయి. తెలుగుదేశం పార్టీ అధినేతను జైల్లో పెట్టడం ద్వారా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్న విపక్ష నేతలను కట్టడి చేయడంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఆ తర్వతా పవన్ కల్యాణ్ కూడా కృష్ణా జిల్లాలో మాత్రమే యాత్ర నిర్వహించారు. లోకేష్ పాదయాత్ర ఊహించని విధంగా సక్సెస్ అయిందని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. మొదట్లో పాదయాత్రలో జనాలు లేరని.. లోకేష్ పాదయాత్ర చేయలేరని వైఎస్ఆర్‌సీపీ సోషల్ మీడియా ఎటాక్ చేసినా.. పోలీసులు అనేక రకాల ఇబ్బందులు పెట్టినా పాదయాత్ర కొనసాగించారు. చంద్రబాబు అరెస్టు తర్వాత లోకేష్ పాదయాత్ర ఆపేశారు. మధ్యలో ఓ సారి ప్రారంభించడానికి సన్నాహాలు చేశారు కానీ.. న్యాయపోరాటం కోసం ఆపక తప్పలేదు. నారా లోకేష్ చంద్రబాబు విషయంలో న్యాయపోరాటం కోసం పాదయాత్ర నిలిపివేశారు. అయితే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు ఎక్కడా తగ్గలేదని టీడీపీ నేతలు గుర్తు చేస్తున్నరు. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ గతం కంటే ఎక్కువగా ఇప్పుడే పోరాటం చేస్తోందని గుర్తు చేస్తున్నారు. ఏదైనా ప్రభుత్వంపై పోరాటమేనని గుర్తు చేస్తున్నారు. ఇాలాంటి అరెస్టుల ద్వారా వచ్చే ఇంపాక్ట్ వేరే ఉంటుందని టీడీపీ నేతలు అంటున్నారు. చంద్రబాబును అరెస్టు చేయడం ద్వారా టీడీపీకి మేలు చేశారని.. రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి.. ఆ తర్వాత ప్రభుత్వ వేధింపుల కారణంగా క్యాడర్,లీడర్ చాలా వరకూ సైలైంట్ గా ఉండిపోయారు. వారందర్నీ పూర్తి స్థాయిలో యాక్టివ్ అయ్యేలా చివరికి వృద్ధులు సైతం రోడ్డు మీదకు వచ్చేలా చేశారని.. ఇది టీడీపీకి ఆయన చేసిన మేలు అంటున్నారు. చంద్రబాబు బయటకు వచ్చిన తర్వాత ఆ మూమెంటంను ఎవరూ ఆపలేరని.. అంటున్నారు. సంక్షోభాల్లోనూ అవకాశాలు వెదుక్కోవాలని చంద్రబాబు చెప్పే మాటల్ని టీడీపీ నేతలు పక్కాగా వంటబట్ిటంచుకుంటున్నారు