Highlights
- సన్‌రైజర్స్ చిత్తు
- శతక్కొట్టిన వాట్సన్
- మ్యాన్ అఫ్ ది మ్యాచ్ వాట్సన్
- సూపర్ కింగ్స్ ఖాతాలో మూడో టైటిల్
చెన్నై సూపర్ కింగ్స్.. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో తామే రారాజులమని మరోసారి చాటిచెప్పింది. రెండేళ్ల నిషేధం తర్వాత బరిలోకి దిగినా తమలో ఏ మాత్రం సత్తా తగ్గలేదని నిరూపిస్తూ ,అసాధారణ ఆటతో ట్రోఫీని పట్టేసింది..తొలుత సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 178 పరుగులు చేసింది. కెప్టెన్ కేన్ విలియమ్సన్ (36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 47)తో పాటు యూసుఫ్ పఠాన్ (25 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 45 నాటౌట్) మెరుపులు మెరిపించాడు. ఆఖర్లో బ్రాత్‌వైట్ (11 బంతుల్లో 3 సిక్సర్లతో 21) ధనాధన్ షాట్లతో అలరించాడు. తరువాత బ్యాటింగ్ కి చెన్నై ఝల్లు విదిల్చింది. షేన్ వాట్సన్ (57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 నాటౌట్) విధ్వంసకర శతకంతో చెలరేగడంతో 179 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 18.3 ఓవర్లలో రెండే వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. సురేశ్ రైనా (24 బంతుల్లో 3 ఫోర్లు, సిక్సర్‌తో 32) సత్తా చాటాడు.