మొదటి రోజు మహానాడుకి హాజరు కాలేకపోయినా బాలకృష్ణ రెండో రోజు సమావేశాలలో పాల్గొని ప్రధాన ఆకర్షణగా నిలిచారు.రెండో రోజు సమావేశం ప్రారంభానికి ముందే సభాస్థలికి చేరుకోగా, అభిమానులు, కార్యకర్తలు బాలయ్యను పలకరించేందుకు, సెల్ఫీలు దిగేందుకు ఉత్సాహం చూపారు. బాలకృష్ణ సైతం వారితో ఆప్యాయంగా మాట్లాడారు.
ఆపై మీడియాతో మాట్లాడిన ఆయన, తాను తలపెట్టిన ఎన్టీఆర్ బయోపిక్ కు క్రిష్ న్యాయం చేయగలడనే నమ్ముతున్నట్టు తెలిపారు. అందరి అంచనాలకు తగ్గట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ ఉంటుందని చెప్పారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదల చేస్తామని తెలిపారు.