YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కోర్టుల్లో ఏం జరుగుతోంది

కోర్టుల్లో ఏం జరుగుతోంది

విజయవాడ, అక్టోబరు 36,
చంద్రబాబుకి బ్లాక్‌ ఫ్రైడే .. కోర్టుల్లో వరుస ఎదురుదెబ్బలుస్కీం స్కాం అవినీతి కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి శుక్రవారాలు కలిసి వస్తున్నట్టు కనిపించడం లేదు... జైలుకి వెళ్లిన నటి నుంచి ఆయనకు అన్నీ బ్లాక్ ఫ్రైడేలే ... కోర్టుల్లో వరుసగా ఎదురు దెబ్బలు  తగులుతూనే ఉన్నాయి. అటు సుప్రీంకోర్టులో.. విజయవాడలోని సీఐడీ కోర్టులోనూ తాజా శుక్రవారం ఆయనకు ఎలాంటి ఊరటా లభించలేదు. దీంతో టీడీపీ శ్రేణులు డీలా పడిపోతున్నాయి.
స్కిల్ డెవలప్ మెంట్ పేరుతో స్కాం చేశారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడిని ఏపీ ఏసీబీ అరెస్ట్ చేసి జైలు పాలు చేసింది... ఆయన పేరుమోసిన లాయర్లను పెట్టుకుని బెయిల్ కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా ఏవీ ఫలించడం లేదు.. విజయవాడ సీఐడీ కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఎక్కడకు వెళ్లినా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి ... విచిత్రమేంటంటే ఆయన బెయిల్ కోసం పెట్టుకున్న పిటీషన్లన్నీ దాదాపు శుక్రవారం నాడే విచారణకు రావడం... రిజెక్ట్ అవ్వడం కామన్ అయిపోతోంది ...
వాయిస్
తాజాగా సైబర్‌నెట్‌ స్కామ్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోసం చంద్రబాబు వేసిన పిటిషన్‌ను విచారణ అనంతరం సుప్రీం కోర్టు శుక్రవారం వాయిదా వేసింది ...  చంద్రబాబు తరపున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు... పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయి.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయ్యింది... ఆ క్రమంలో సైబర్‌నెట్‌ కేసులో అరెస్ట్‌ చేయవద్దని ఇప్పటికే కోర్టు చెప్పింది
ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ తన వాదనలు వినిపిస్తూ .. ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు...
చంద్రబాబు జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతోందని .. ఈ అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లో తెలిపామని స్పష్టం చేశారు...
వాయిస్
వాదనలు విన్న ధర్మాసనం విచారణను నవంబర్‌ ఎనిమిదవ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది ...  స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌ కేసులో తీర్పు పెండింగ్‌లో ఉన్న విషయాన్ని చంద్రబాబు తరఫు లాయర్లకు గుర్తు చేసినప్పటికీ...  ధర్మాసనం ఆ క్వాష్‌ పిటిషన్‌పై తీర్పు వెలువడిన తర్వాతనే ఫైబర్‌నెట్‌ కేసును పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టం చేసింది.
క్వాష్‌ పిటిషన్‌పై తీర్పును నవంబర్‌ ఎనిమిదవ తేదీన వెల్లడిస్తామంది ద్విసభ్య ధర్మాసనం తెలిపింది.
వాయిస్
అయితే ఫైబర్‌ నెట్‌ కేసులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ ఎనిమిదవ తేదీకి కాకుండా..  తొమ్మిదవ తేదీకి వాయిదా వేయాలని చంద్రబాబు లాయర్‌ లూథ్రా ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు.వ్యక్తిగత ఇబ్బంది రీత్యా తదుపరి విచారణను ఒక్కరోజు పొడిగించాలని కోరారు... ధర్మాసనం ఆ విజ్ఞప్తిని మన్నించి.. నవంబర్‌ తొమ్మిదివ తేదీనే విచారణ చేపడతామని తెలిపింది... అంతవరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది.
ఇక చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై ఇప్పటికే పక్షాల వాదనలు పూర్తి అయ్యాయిసెక్షన్‌17-ఏ మీదనే వాడివేడి వాదనలు జరిగాయి ... వాదనలు ముగిసే సమయంలో చంద్రబాబు తరఫు లాయర్‌ హరీశ్‌ సాల్వే మధ్యంతర బెయిల్ కోసం విజ్ఞప్తి చేశారు. కానీ, కేసులో ప్రధాన వాదనలు విన్నామని.. ఈ సమయంలో మధ్యంతర బెయిల్‌ ప్రస్తావన ఉండబోదని..  నేరుగా తుది తీర్పే ఇస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో తీర్పు ఎలా ఉండబోతుందా? అనే ఉత్కంఠత సర్వత్రా ఏర్పడింది.
వాయిస్
మరోవైపు ఫైబర్‌ నెట్‌ కేసు పిటిషన్‌ను వాయిదా వేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం తాలూకు ప్రభావం శుక్రవారం సీఐడీ కోర్టులో పీటీ వారెంట్‌ పిటిషన్‌ జరిగే విచారణపై కూడా పడింది.. ఏపీ సీఐడీ చంద్రబాబును విచారించేందుకు పీటీ వారెంట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే..దీనిపై విచారణ చేపట్టిన కోర్టు.. చంద్రబాబును కోర్టులో హాజరు పర్చాలని కూడా ఆదేశించింది. కానీ, సుప్రీం కోర్టులో పిటిషన్‌ పెండింగ్‌లో ఉండడంతో.. అది వాయిదా పడుతూ వస్తోంది... ఈ క్రమంలో శుక్రవారం జరగాల్సిన విచారణ సైతం వాయిదా పడింది.. దాంతో  ఫైబర్‌నెట్‌ కేసులో చంద్రబాబును కోర్టులో  హాజరుపరచాల్సి వస్తే.. మళ్లీ అరెస్ట్‌ చేస్తారేమోననే ఆందోళన టీడీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది
వాయిస్
లీగల్‌ ములాఖత్‌ల సంఖ్య పెంచాలని చంద్రబాబు తరఫు లాయర్లు వేసిన పిటిషన్‌ను శుక్రవారం అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానం కొట్టేసింది. .. ములాఖత్‌ల సంఖ్య పెంచేలా ఆదేశాలు ఇవ్వాలని, ఈ పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు కోరారు. చంద్రబాబు కేసుల విచారణ వివిధ కోర్టుల్లో ఉన్నందున ములాఖత్‌ల సంఖ్య మూడుకు పెంచాలని పిటిషన్‌లో అభ్యర్థించారు. అయితే.. అలా చేయడం సాధ్యం కాదని కోర్టు తెలిపింది. కౌంటర్‌ దాఖలు చేయాలంటూ ఏపీ సీఐడీని ఆదేశించింది.  .. తాజాగా శుక్రవారం ఈ పిటిషన్‌ ఏసీబీ కోర్టు ముందుకు రాగా.. కోర్టు కొట్టేసింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో ఈ పిటిషన్‌ విచారణకు అర్హత లేదని తిరస్కరిస్తూ.. సరైన లీగల్‌ ఫార్మట్‌లో దాఖలు చేయాలంటూ చంద్రబాబు తరపు లాయర్లకు సూచించింది ... మొత్తంగా చూస్తే అరెస్ట్ తర్వాత ప్రతి శుక్రవారం చంద్రబాబుకి బ్లాక్ ఫ్రైడేగానే మారినట్లు కనిపిస్తోంది...
 

Related Posts