YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రాములోరి భూములపై కన్ను...

రాములోరి భూములపై కన్ను...

ఏలూరు, అక్టోబరు 26,
రాయలసీమ నుండి కృష్ణా జిల్లా వరకూ.. గోదావరి జిల్లాల నుండి ఉత్తరాంధ్ర వరకూ వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన భూకబ్జాలు అన్నీ ఇన్నీ కావు. రాజధాని పేరిట విశాఖలో ఈ భూ అరాచకాలు కోకొల్లలు. ప్రకాశం జిల్లా కేంద్రంగా.. సీఎం జగన్ మోహన్ రెడ్డికి దగ్గరి బంధువే భూ ఆక్రమణలు, అక్రమ రిజిస్ట్రేషన్ల బండారాన్ని మరో వైసీపీ నేతే బయట పెట్టారు. ఈ వ్యవహారంలో పదిమందిని అరెస్ట్ చేయగా.. ఈ కేసులో కీలక నేతలు కూడా అరెస్ట్ కావాల్సి ఉందని సదరు వైసీపీ నేతే చెప్తున్నారు. ప్రభుత్వ భూములు ఖాళీగా కనిపిస్తే చాలు సొంతం చేసుకోవడమే పనిగా పెట్టుకున్నారు అధికార పార్టీ నేతలు. ఎక్కడ పోరంబోకు భూములు కనిపించినా మండలస్థాయి నేతల నుండి జిల్లా స్థాయి నేతల వరకూ ఎవరికి వారు  కబ్జాకు దిగుతున్నారు. కేవలం ప్రజల భూములే కాదు దేవుడి భూములను కూడా వదలడం లేదు. సుపరిపాలన అందించి ఆదర్శమూర్తిగా మూర్తీభవించిన సాక్షాత్తు శ్రీరాముల వారి భూములను కూడా మింగేశారు.ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం పురుషోత్తమపట్నం గ్రామంలో 917 ఎకరాల భూమిని 1878లో సోమరాజు పురుషోత్తమరాజు రిజిస్టర్‌ డీడ్‌ ద్వారా భద్రాచలం దేవస్థానానికి బహూకరించారు. ఈ భూమి రాములవారిదే అయినా స్థానికులు కొందరు ఆక్రమించుకొన్నారు. ఈ భూముల విషయంలో దేవస్థానానికి వ్యతిరేకంగా ఆక్రమించుకున్న వారు  వివిధ కోర్టుల్లో కేసులు వేయగా దేవస్థానానికి అనుకూలంగానే తీర్పులు వచ్చాయి. ఈ భూములకు దేవస్థానం పేరుతో పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు, యాజమాన్య ధ్రువీకరణ పత్రాలు కూడా ఉండగా ఆన్‌లైన్‌లో కూడా వివరాలన్నీ దేవస్థానం పేరుతోనే ఉన్నాయి. 2005 నుంచి 2010 వరకు ఎకరాకు రూ.1,000 చొప్పున ఆక్రమణదారుల నుంచి డ్యామేజెస్‌ ఫర్‌ యూజ్‌ అండ్‌ ఆక్యుపేషన్‌ చార్జెస్‌ కింద వసూలు చేయగా 2021-22 నాటికి దీనిని రూ.4 వేలకు పెంచారు. రాష్ట్ర విభజన సమయంలో భదాద్రి దేవస్థానం తెలంగాణకు వెళ్లగా.. భద్రాద్రికి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో భూములు ఉన్న ఈ భూములున్న ప్రాంతం పురుషోత్తమ పట్నం ప్రాంతాన్ని ఏపీకి కేటాయించారు. అయితే, ఆక్రమణదారులు 2018 నుంచి ఆక్యుపేషన్‌ చార్జెస్‌ చెల్లించకపోగా.. చెల్లించేదిలేదని కరాఖండిగా చెప్తున్నారు. సరిగ్గా ఇక్కడే స్థానిక వైసీపీ నేతలు ఎంటరై ఆక్రమణదారులకు కాపాడడమే కాకుండా.. మరికొంత భూములను కూడా  కబ్జా చేసినట్లు తెలుస్తున్నది.
అయితే, ఈ మధ్యనే దేవస్థానం ఈ భూములను స్వాధీనం చేసుకొనేందుకు  ప్రయత్నాలు మొదలెట్టింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా దేవస్థానం ఆధీనంలో ఉన్న భూములలో 110 ఎకరాలలో దాతల సహకారంతో గోశాల నిర్మాణం చేపట్టారు. అయితే, ఈ నిర్మాణాన్ని ఆక్రమణదారులు అడ్డుకుంటున్నారు. దేవస్థాన భూములను తిరిగి అప్పగించాల్సిన వివిధ శాఖల అధికారులు కోర్టు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. మొత్తం 14 శాఖలు ఈ భూములకు రక్షణ కల్పించి దేవస్థానికి అప్పగించాల్సి ఉంది. హైకోర్టులో ఈ కేసు దాఖలైన రోజు నుండీ ఇప్పటి వరకూ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఇప్పుడు హైకోర్టు ఈ వ్యవహారంలో కీలక ఆదేశాలు జారీ చేసింది.ఈ భూములను ఆక్రమించుకున్న వారికి నోటీసులు ఇచ్చి, ఇక్కడ ఉన్న నిర్మాణాలను తొలగించి దేవస్థానికి భూములు అప్పగించాలని ఏపీ హైకోర్టు ఆదేశించింది. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నిజానికి ఈ కబ్జా వ్యవహారం అంతా వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరిగినట్లు తెలుస్తున్నది. భూములలో అక్రమ కట్టడాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ సిబ్బందిని దుర్భాషలాడిన అక్రమార్కులు, దాడులకు యత్నించారు. దీనిపై ఫిర్యాదు చేసినా స్థానిక పోలీసులు పట్టించుకోవడం లేదు. రెవెన్యూ, దేవాదాయ లాంటి మిగతా శాఖలు కూడా ఈ విషయంలో భద్రాద్రి ఆలయ అధికారులకు సహకరించడం లేదు. ఏపీ ప్రభుత్వం నుండి కనీస స్పందన కూడా రావడం లేదు. అయితే, దీని వెనక బడా వైసీపీ నేతల హస్తం ఉండడమే ఏపీలో ఏ శాఖ నుండి సహకారాలు అందడం లేదని తెలుస్తుంది. ఏపీ ప్రభుత్వ అండదండలతో కబ్జా దారులు ఈ వ్యవహారంలో భద్రాద్రి అధికారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. మరి ఇప్పుడు హైకోర్టు ఆదేశాలతో అయినా అధికారులు కబ్జాదారుల నుండి దేవాలయ భూములను ఖాళీ చేసి తిరిగి అప్పగిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

Related Posts