YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

చకచకా మారుతున్న రాజకీయాలు

చకచకా మారుతున్న రాజకీయాలు

హైదరాబాద్, అక్టోబరు 26,
తెలంగాణలో ఎన్నికలకు ముందు రాజకీయ సమీకరణలు చకచకా మారిపోతున్నాయి... హ్యాట్రిక్ కొట్టాలని వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్‌ కు ఊహించని షాక్‌లే తగులుతున్నాయి. అభ్యర్థులను ప్రకటించిన మరుక్షణం నుంచే అధికార పక్షంలో నుంచి కాంగ్రెస్‌లోకి చేరికలు మొదలయ్యాయి .... ముఖ్యనేతలు, కీలక నేతలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సైతం గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పేసి హస్తం గూటికి చేరిపోతున్నారు.
బీఆర్ఎస్ నుంచి కీలక నేతలతో మొదలైన వలసలు కొనసాగుతూనే ఉన్నాయి ... కేసీఆర్ అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్ధులను ప్రకటించిన నాటి నుంచే ఈ వలసల పర్వానికి తెర లేగించి ... కీలక నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డితో  మొదలైన చేరికలు.. ఇప్పటి వరకూ కొనసాగుతూనే ఉన్నాయి ... ముఖ్యంగా కాంగ్రెస్లోకి చేరికలు పెరిగిపోతుండటం గమనార్హం.పెద్ద సంఖ్యలో అధికారపక్ష ముఖ్యనేతలు, ద్వితీయ శ్రేణి నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరిపోయారు ... ఈ చేరికలతో ఒకట్రెండు జిల్లాల్లో బీఆర్ఎస్ పరిస్థితి మరీ ఘోరంగా తయారయ్యిందని రాజకీయ విశ్లేషకులు, సొంత పార్టీ నేతలే చెప్పుకుంటున్న పరిస్థితి ... ఇందులో ఉమ్మడి ఖమ్మం జిల్లా మొదటిదని కాంగ్రెస్ నేతలు చెప్పుకుంటున్నారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ క్లీన్ స్వీప్ చేస్తామని పొంగులేటి, తుమ్మల నాగేశ్వరరావులాంటి నేతలు ధీమాగా చెబుతున్నారు. ఒకరిద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఒకట్రెండు రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఉందని తెలుస్తోంది.
స్పాట్
ఇక అసలు విషయానికొస్తే.. జయశంకర్ భూపాలపల్లిలో బీఆర్ఎస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఒకేసారి ఐదుగురు కౌన్సిలర్లు గులాబీ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ కూడా కాంగ్రెస్‌లో చేరారు. హైదరాబాద్‌ వేదికగా.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సమక్షంలో ఈ చేరికలు జరిగాయి. కురిమిల్ల రజిత  శ్రీనివాస్, చల్లూరి మమత - కమలాకర్, ముంజాల రవి గౌడ్, చల్ల రేణుక  రాములు, తొట్ల సంపత్‌తో పాటు టీబీజీకేఎస్ జీఎం కమిటీ మెంబర్ మండ సంపత్ గౌడ్ కూడా ఉన్నారు.
స్పాట్
ఈ నేతల చేరికలో గండ్ర సత్యనారాయణ కీలకపాత్ర పోషించారట ... ఈ ఆరుగురు నేతలతో మంతనాలు జరిపి.. భూపాలపల్లి నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి కండువాలు కప్పించారంటున్నారు ... ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ.. భూపాలపల్లిలో గండ్ర సత్తన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని కౌన్సిలర్లకు రేవంత్ రెడ్డి సూచించారు. తప్పకుండా అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని ఆ ఐదుగురు నేతలు.. రేవంత్‌కు మాటిచ్చారట... ఏదేమైనా ఈ వలస రాజకీయాలు కాంగ్రెస్ కు ప్లస్ అవుతాయో? ఉట్టి ముంచుతాయో చూడాలి

Related Posts