YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వేములవాడ టిక్కెట్ ఫైట్

 వేములవాడ టిక్కెట్ ఫైట్

హైదరాబాద్, అక్టోబరు 26,
తెలంగాణ భారతీయ జనతా పార్టీ(బీజేపీ) రెండో జాబితాపై కసరత్తు కొనసాగుతోంది. తెలంగాణ ఎన్నికల కోసం 52మందితో బీజేపీ తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.. కానీ విడుదలైన మర్నాటి నుంచే అసంతృప్తులు మొదలయ్యాయి. అలకలు, కన్నీళ్లు కూడా కనిపిస్తున్నాయి. ఎవరో కాదు.. బండి సంజయ్ కూడా లిస్ట్‌పై అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయనకు కరీంనగర్‌లో చోటు దక్కినా, తన అనుకున్నవాళ్లకు కొన్ని టికెట్లు కూడా ఇప్పించుకోలేక పోయినట్లు సంజయ్‌ ఆవేదనలో ఉన్నట్లు సమాచారం. ఇక మాజీ ఎంపీ వివేక్ అయితే టికెట్ల విషయంలో ఎక్కడా తనను పరిగణనలోకి తీసుకోలేదని చిన్నబుచ్చుకున్నట్లు తెలుస్తోంది.వేములవాడలో బీజేపీ టికెట్ కోసం ఇద్దరు అభ్యర్థుల మధ్య టికెట్ కోసం కోల్డ్ వార్ కొనసాగుతోంది. మాజీ జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు డాక్టర్ వికాస్ మధ్య టికెట్ వార్ ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ ఆఫీసుకు చేరింది. తన కుమారుడికి వేములవాడ టికెట్ ఇవ్వాలంటూ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రకాష్ జవదేకర్‌, సునీల్ బన్సల్‌‌ను మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కలిశారు. వేములవాడ సీటు పై చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. వేములవాడ అసెంబ్లీ సీటును వికాస్ రావుకే ఇవ్వాలంటూ విద్యాసాగర్ రావు ఒత్తిడి తెస్తున్నట్లుగా సమాచారం. మరోవైపు, తుల ఉమ కోసం ఈటెల రాజేందర్‌ పట్టుపడుతున్నారు.ఇప్పటికే బీజేపీ కార్యాలయంలో వేములవాడ టికెట్టు కోసం దరఖాస్తు చేసుకున్నారు తుల ఉమ. వేములవాడలో ఇప్పటికే తుల ఉమ ప్రచారం మొదలు పెట్టారు. బీజేపీ ఆశావహ అభ్యర్థిగా టిక్కెట్ కోసం ప్రయత్నం చేస్తున్న తుల ఉమ ప్రచార కార్యక్రమానికి పోస్టర్లతో శ్రీకారం చుట్టారు. కేసీఆర్ పాలనను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలను సంధించారు. వేములవాడలో పాగా వేసే క్రమంలో ‘సాలు దొర – సెలవు దొర’ అంటూ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు తుల ఉమ. వేములవాడ అభివృద్ధికి తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారుదీంతో మొదటి జాబితాలో వేములవాడ టికెట్‌ను బీజేపీ ఖరారు చేయలేదు. ఇక వికాస్‌ రావు కు బండి సంజయ్ మద్దతు ఇస్తుంటే… తుల ఉమకు ఈటల మద్దతు ఇస్తున్నారు. మరోవైపు మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కూడా రంగం లోకి దిగారు. తనయుడు వికాస్‌కు టికెట్ కోసం ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈటల రాజేందర్‌ మాత్రం తుల ఉమకు ఇవ్వాలని పట్టుబడుతున్నారు. రెండుమూడు రోజుల్లో రెండవ జాబితా ప్రకటించే అవకాశం ఉంది. అప్పుడే ఈ పంచాయితీ తేలేలా ఉంది. అయితే ఈ టికెట్ పెండింగ్ పెట్టడంతో బండి సంజయ్ నారాజ్ అయినట్లు సమాచారం.

Related Posts