YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

పాలకుర్తి మండలం లో కాంగ్రెస్ లో భారీగా చేరికలు..

పాలకుర్తి మండలం లో కాంగ్రెస్ లో భారీగా చేరికలు..

మాన్ పూర్
పాలకుర్తి మండలం కన్నాల రానాపూర్ జీడి నగర్ తదితర  గ్రామాల నుండి వివిధ పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలో జిడి నగర్ సర్పంచ్, డిసిసి ప్రధాన కార్యదర్శి కేశవరం సిమెంట్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ కార్మికుల అధ్యక్షుడు సూర సమ్మయ్య మరియు రానాపూర్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు బాలసాని కుమార్ గౌడ్  ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో భారీ ఎత్తున చేరారు. పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఆహ్వానించారు.
మంథని నియోజకవర్గం పాలకుర్తి  మండలంలోని రాణాపూర్ గ్రామానికి చెందిన బయ్యపు కమలాకర్ రెడ్డి, జాజిమోగ్గుల తిరుపతి యాదవ్,చంటి మైసయ్య, ఆసం దుర్గయ్య, కోడూరి వెంకటేష్, ఇటవేణి కొమురయ్య, పర్లపెల్లి వంశీ, దురశెట్టి మరీన్, నాగుల సతీష్ గౌడ్, సంటి తిరుమల  బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. వారికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఏఐసీసీ సెక్రెటరీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు  ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో మైనారిటీ నాయకులు మొహమ్మద్ ఇబ్రహీం, బామ్లనాయక్ తండా మాజీ ఉపసర్పంచ్ జ్యోతి శంకర్, రాణాపూర్ మాజీ సర్పంచ్ బాలసాని కుమార్ గౌడ్, కన్నాల గ్రామశాఖ అధ్యక్షుడు బుతగడ్డల రమేష్, వేల్పుల రాజ్ కుమార్, సంపంగి కుమార్ మరియు పాలకుర్తి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు .

Related Posts