YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రబాబు బెయిల్ పై పవన్ కళ్యాణ్ హర్షం

చంద్రబాబు బెయిల్ పై పవన్ కళ్యాణ్ హర్షం

విజయవాడ
 టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి మధ్యంతర బెయిల్ లభించడం పట్ల జనసేనాని పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.  ఎక్స్ వేదికగా ఆయన స్పందిస్తూ... 'తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కు హైకోర్టు ద్వారా మధ్యంతర బెయిల్ లభించడం సంతోషకరం. సంపూర్ణ ఆరోగ్యంతో, ఇనుమడించిన ఉత్సాహంతో ప్రజా సేవకు పునరంకితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. ఆయన అనుభవం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం. చంద్రబాబు  విడుదల కోసం కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అందరం ఆయనను స్వాగతిద్దాం' అని ట్వీట్ చేశారు.

చంద్రబాబుకు బెయిల్ రావడం పట్ల టిడిపి శ్రేణుల హర్షం
మంథని

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బిగ్ రిలీఫ్ దక్కిందని,స్కిల్ స్కాం కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు బెయిల్ మంజూరు కావడం పట్ల మంగళవారం మంథని పట్టణంలో తెలుగు తమ్ముళ్లు సంబరాలు నిర్వహించారు. నాలుగు వారాలపాటు చంద్రబాబు నాయుడుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలను ఆయన తరఫు న్యాయవాదులు ప్రత్యేకంగా కోర్టులో ప్రస్తావించారని దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం చంద్రబాబు ఆరోగ్య సమస్య లు దృష్టిలో పెట్టుకొని  షరతులతో కూడిన నాలుగు వారాలు పాటు మధ్యంతర బెల్ మంజూరు చేయడం సంతోషకరమన్నారు.   చంద్రబాబు నాయుడు కు బెయిల్ మంజూరు అయినందుకు హర్షం వ్యక్తం చేస్తూ మంథని తెలుగుదేశం పార్టీ ఆఫీసులో మంథని నియోజకవర్గ ఇన్చార్జి మాదాడి శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకొన్నారు.  ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పెద్దపల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఆర్గనైజింగ్ సెక్రెటరీ
 మెండే రాజయ్య,  రాష్ట్ర మహిళా నాయకురాలు మెండే లక్ష్మి, పెద్దపెల్లి జిల్లా పార్లమెంటరీ పార్టీ ఉపాధ్యక్షులు అందే భాస్కర చారి, ముత్తారం మండల పార్టీ అధ్యక్షులు రాజ్ మహ్మద్, యువత అధ్యక్షులు బడుగు మహేష్, నరేందర్ రెడ్డిలు పాల్గొన్నారు.

సింహం బోనులో నుంచి బయటికి వచ్చింది

నందిగామ
టీడీపీఅధినేత చంద్రబాబు కు బెయిల్ రావడంపై నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పందించారు. సింహం బోనులో నుంచి బయటికి వచ్చిందని అన్నారు. టీడీపీ నాయకులు, కార్య కర్తలు నందిగామలో సంబరాలు నిర్వహించారు.ఇక వేట మొదలైందని వైసీపీ నాయకులు ఇక జాగ్రత్త అని సూచించారు.

Related Posts