YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వరంగల్ తూర్పు బీఎస్పీ అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్

వరంగల్ తూర్పు బీఎస్పీ అభ్యర్ధిగా ట్రాన్స్ జెండర్

వరంగల్
తెలంగాణ శాసనసభకు వచ్చే నెలలో జరగనున్న ఎన్నికల్లో తొలిసారి ఒక ట్రాన్స్జెండర్  బరిలో దిగుతున్నారు. బీఎస్పీ పార్టీ టికెట్పై పోటీచేయబోతున్నారు. ఆ పార్టీ 43 మంది అభ్యర్థులతో తాజాగా ప్రకటించిన రెండో జాబితాలో వరంగల్ తూర్పు స్థానాన్ని  పుష్పిత లయకు కేటాయించింది. 43 మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. ఈ జాబితాలో 26 మంది బీసీలతోపాటు ఆరుగురు ఎస్సీలు, ఏడుగురు ఎస్టీలు, ముగ్గురు అగ్రవర్ణాలు, ఇద్దరు మైనారిటీలకు చోటు కల్పించారు. వరంగల్ కరీమాబాద్ నివాసి అయిన పుష్పిత ట్రాన్స్జెండర్. బీఎస్పీలో యాక్టివ్గా ఉంటున్నారు. ఆమెకు టికెట్ రావడంతో హిజ్రాలు సంబరాలు చేసుకుంటున్నారు.

Related Posts