YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు విద్య-ఉపాధి

నాలుగు రోజుల్లో కొత్త విద్యా సంవత్సరం కొత్త సార్లపై లేని క్లారిటీ

నాలుగు రోజుల్లో  కొత్త విద్యా సంవత్సరం కొత్త సార్లపై లేని క్లారిటీ

చాలా కాలంగా ఎదురుచూస్తున్న టీచర్ల నియామకాలపై స్పష్టత కొరవడింది. ఈ విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి కొత్త ఉపాధ్యాయులు వస్తారని పలుమార్లు ప్రభుత్వం ప్రకటించినా ఆచరణ కు మాత్రం నోచుకోలేదు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు గడుస్తున్నా ఒక్క డీఎస్సీ(టీఆర్‌టీ) ప్రక్రియ సక్రమంగా నిర్వహించకపోవడంపై నిరుద్యోగ అభ్యర్థులు గగ్గోలు పెడుతున్నారు.ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ నుంచి టీఆర్‌టీ పరీక్షలను నిర్వహించారు. మే మొదటి వారంలో ఫలితాలను విడుదల చేసి నెలాఖరులోగా స్థానాల భర్తీ ప్రక్రియను పూర్తి చేస్తామని ప్రకటించినా ఆ దిశగా అడుగులు ముందుకు పడడం లేదు. మే నెలాఖరులోగా నియామకాల భర్తీ చేస్తామని ప్రకటించినా అమల్లో అపసోపాలు తప్పడం లేదు. ఈ ఏడాది కూడా విద్యావలంటీర్లే దిక్కవనున్నారు. కేసుల కారణంగా జాప్యం జరుగుతోంది.ఉభయ జిల్లాల్లో 2372 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో 2014 లెక్కల ప్రకారం 1136 ఉపాధ్యాయ స్థానాలు ఖాళీ ఉన్నట్లు లెక్క తేల్చారు. ఆ తర్వాత పలుమార్లు నివేదికల రూపకల్పనలో స్థానాల సంఖ్య తగ్గింది. చివరకు వేర్వేరు జిల్లాల్లో స్థానాల సంఖ్యలో తేడా వస్తోందని భావించి పలువురు కోర్టుకెక్కారు. దీంతో ఉభయ జిల్లాల ఉపాధ్యాయ నియామకాలకే ప్రభుత్వం మొగ్గుచూపింది.నూతన జిల్లాల ఆవిర్భావం తర్వాత ఉపాధ్యాయ స్థానాల భర్తీలో న్యాయం జరుగుతోందని భావించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. ఉభయ జిల్లాల ప్రాతిపదికన నియామకాలు చేపట్టడంతో పరిస్థితి మొదటికొచ్చింది. గత విద్యాసంవత్సరం ప్రారంభంలో నూతన వీవీలను ఉభయ జిల్లాల్లో నియమించారు. మరో మూడు నెలల్లో టీఆర్‌టీ ప్రకటన విడుదలవుతోందనే ప్రకటనలతో నిరుద్యోగ అభ్యర్థులు ఆందోళన చెందారు. కొందరు మధ్యలోనే వీవీల బాధ్యతల నుంచి తప్పుకున్నారు. రూ.8000 నుంచి రూ.12000 వేతనాలు పెంచినా నిరుద్యోగ అభ్యర్థులకు ఊగిసలాటగా మారింది. ప్రభుత్వ బడుల్లో చాలా చోట్ల బోధకులు లేక విద్యాబోధనపై తీవ్ర ప్రభావం చూపింది. అక్టోబరులో టీఆర్‌టీ ప్రకటన విడుదయ్యాక వీవీలు పూర్తిగా విధులు మానేశారు. దీంతో విద్యావ్యవస్థ నిర్వహణకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఫిబ్రవరిలో టీఆర్‌టీ పరీక్షలు నిర్వహించారు. ఈ విద్యాసంవత్సరమంతా విద్యాబోధనకు అవరోధాలు తప్పలేదు. తిరిగి ఈ ఏడాది బడులు తెరుచుకునే సమయానికి కొత్త సార్లూ వస్తారని ఆశతో నిరీక్షించిన చర్యలు ఫలించ లేదు. ఈ విద్యాసంవత్సరం అర్ధభాగం వరకు వీవీలతో కాలం వెళ్లదీసే పరిస్థితులు నెలకొన్నాయి.

Related Posts