YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు సినిమా

'అనగనగా ఓ రాకుమారుడు'గా కాంతారావు బయోపిక్..!!

'అనగనగా ఓ రాకుమారుడు'గా  కాంతారావు బయోపిక్..!!

 టాలీవుడ్ లో బయోపిక్ సందడి నెలకొంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా 'మహానటి' సినిమా వచ్చి, ప్రేక్షక ఆదరణ పొందింది. మరో వైపు బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ని మొదలు పెట్టారు.ఇప్పుడు మరో బయోపిక్  తెరకెక్కబోతుంది. జానపద కథా చిత్రాలతో కాంతారావు తనదైన ప్రత్యేకతను చాటుకున్నాకాంతారావు. పౌరాణిక .. చారిత్రక .. సాంఘిక చిత్రాలలోను ఎన్నో కీలకమైన పాత్రలను పోషించారు. అలాంటి కాంతారావు .. నిర్మాతగా నష్టాలు చవి చూసి ఆర్థికపరమైన ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఆయన బయోపిక్ ను రూపొందించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. దర్శకుడు పీసీ ఆదిత్య కాంతారావు జీవితచరిత్రను తెరపైకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా నిన్న ఆయన కాంతారావు సొంత ఊరు అయిన కోదాడ మండలం 'గుడిబండ' వెళ్లి, ఆనాటి ఆయన సన్నిహితుల నుంచి కొన్ని వివరాలను సేకరించారు. కాంతారావు తనయుడు ప్రతాప్ నుంచి కూడా కొన్ని వివరాలను సేకరించాననీ, 'అనగనగా ఓ రాకుమారుడు' పేరుతో కాంతారావు బయోపిక్ ను రూపొందించనున్నానని చెప్పారు.

Related Posts