YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

బాబును వెంటాడుతున్న కేసులు

బాబును వెంటాడుతున్న కేసులు

విజయవాడ, నవంబర్ 3,
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో చంద్రబాబుపై వరస కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్టయి యాభై రెండు రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండి మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనారోగ్య కారణాలతో ఆయనకు నాలుగు వారాల పాటు బెయిల్ లభించింది. దీంతో ఆయన ప్రస్తుతం హైదరాబాద్ లోని ఏఐజీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎల్.వి. ప్రసాద్ కంటి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే చంద్రబాబుపై ఇప్పటికే స్కిల్ డెవలెప్‌మెంట్ కేసు ఉండగానే ఫైబర్ నెట్ కేసు నమోదయింది. ఇన్నర్ రింగ్ రోడ్డు స్కామ్ కేసులో కూడా చంద్రబాబును నిందితుడిగా చేరుస్తూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఆ తర్వాత మద్యం కేసులో చంద్రబాబు ఏ 3 నిందితుడిగా పేర్కొంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రను కూడా నిందితుడిగా చేర్చింది. తాజాగా మరో కేసును కూడా సీఐడీ చంద్రబాబుపై నమోదు చేయడం విశేషం.చంద్రబాబు సన్నిహితుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు పదివేల కోట్ల నష్టం... చంద్రబాబు పాలనలో ఇసుక అక్రమాలపై సీఐడీ విచారణ చేపట్టింది. దీనిపై కేసు నమోదు చేసింది. ఏపీఎండీసీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసింది ఈ కేసులో ఏ1 నిందితురాలుగా మాజీ మంత్రి పీతల సుజాత, ఏ2 నిందితుడుగా చంద్రబాబు, ఏ3 నిందితుడుగా చింతమనేని ప్రభాకర్, ఎ4 నిందితుడుగా దేవినేని ఉమామహేశ్వరరావుపై కేసు నమోదు చేసింది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలతో పదివేల కోట్ల మేరకు ఇసుక దోపిడీ జరిగిందని సీఐడీ విచారణలో వెల్లడయిందని తెలిపింది. వీటన్నింటిలో చంద్రబాబు బెయిల్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.చంద్రబాబు నాయుడిపై మరో కేసు నమోదైంది. తెలుగుదేశం పార్టీ హయాంలో ఇసుక అక్రమాలపై కేసులో ఏపీ మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో పీతల సుజాతా ఏ1, చంద్రబాబు నాయుడు ఏ2, చింతమనేని ప్రభాకర్ ఏ3, దేవినేని ఉమాలు ఏ4గా ఉన్నారు. వీరు అక్రమ మైనింగ్‌ల కారణంగా ప్రభుత్వ ఖజానాకు భారీ ఎత్తున గండిపడిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. విచ్చల విడిగా ఇసుక తవ్వకాలు జరిపారని తెలిపారు. గతంలో చంద్రబాబు చేసిన పర్యావరణ నష్టానికి సంబంధించి నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ రూ. 100 కోట్లు జరిమానా విధించింది.ఉచితంగా పేదలకు ఇసుక అందిస్తామన్న ముసుగులో ఈ కుంభకోణానికి పాల్పడినట్లు పేర్కొన్నారు. కాంట్రాక్టులను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించి అదినంత దోచుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉచితంగా ఎంత మంది పేదలకు ఇసుకను అందించారో రికార్డ్ బయటకు తీయాలని తెలిపారు. రాష్ట్రంలో 1000కు పైగా అక్రమ ఇసుక మైనింగ్ కేసులు నమోదయ్యాయి. వసూలు చేసిన పెనాల్టీ విలువ రూ. 40 కోట్లు ఇది సంబంధించి వివరాలను, వాటి లెక్కలను చూపించాలని ఇందులో చేర్చారు. “ఉచిత ఇసుక విధానం” ద్వారా ఖనిజ వనరుల దోపిడీదారులు ప్రభుత్వానికి చెల్లించాల్సిన చట్టబద్ధమైన బకాయిలు కోట్లాది రూపాయలు చెల్లించలేదన్నారు. తమ పార్టీలోని రాజకీయ నాయకులకు లబ్ధి చేకూరే విధంగా ఈ పాలసీని తీసుకొచ్చినట్లు చెప్పారు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం వాటిల్లేలా చేశారని చెబుతూ మరిన్ని అంశాలు పొందుపరిచారు.

Related Posts