YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం

పాడి పశువుల కొనుగోలు మాటున రూ.2,887 కోట్ల భారీ కుంభకోణం

తెనాలి
పాడి పశువుల కొనుగోలు, పంపిణీ మాటున వైసీపీ ప్రభుత్వం భారీ కుంభకోణం చేశారు... ఈ కుంభకోణం విలువ రూ.2,887 కోట్లు అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్  నాదెండ్ల మనోహర్  వెల్లడించారు. లక్షల కొద్దీ పాడి పశువులు కొనుగోలు చేశామని శాసన సభలో ప్రభుత్వం చెప్పిన అధికారిక లెక్కలకు, క్షేత్ర స్థాయిలో అధికారులు చేసిన పరిశీలనలో తేలిన లెక్కలకు  అసలు పొంతనే లేదని అన్నారు. అధికారుల పరిశీలనలో ఉన్నవి కేవలం 8 వేలు మాత్రమే అని తెలిపారు. వైఎస్సార్ చేయూత స్కీమ్ కింద పశువుల కొనుగోలులోనే దాదాపు రూ. 2,887 కోట్ల అవినీతికి ఆస్కారం ఇచ్చిన ఈ స్కామ్ బీహార్ దాణా కుంభకోణం కంటే పెద్దది అని స్పష్టం చేశారు. మినీ డెయిరీల పేరుతో అక్కచెల్లెమ్మలను వైసీపీ ప్రభుత్వం నిండా మోసం చేసిందని చెప్పారు. పశువుల కొనుగోలు స్కామ్ మీద  ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 
ఒక్క రోజులోనే 1,85,210 పాడి పశువులు ఎలా పెరిగాయో ముఖ్యమంత్రిగానీ, సంబంధిత మంత్రులుగానీ సమాధానం చెప్పాలి. అయితే క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలన చేసిన పశు సంవర్థక శాఖ, డెయిరీ విభాగాల అధికారులకు వాస్తవంలో కనిపించినవి 8 వేల పశువులు మాత్రమే. ఒక గేదెను కొనుగోలు చేసి ఆ గేదెనే అనేకమంది కోసం కొనుగోలు చేసినట్లు లెక్కలు చూపించారు.
అసలు లక్షల్లో పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయడం కష్ట సాధ్యమైన ప్రక్రియ. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పశుక్రాంతి పథకం ద్వారా 50 వేల పాడి పశువులను కొనుగోలు చేయడానికి బీహార్, గుజరాత్, హర్యానా వంటి రాష్ట్రాలు తిరిగినా సాధ్యపడలేదు. ఇప్పుడు 3.94 లక్షల పాడిపశువులు కొనుగోలు చేసినట్లు చెబుతున్నారు. వాస్తవంలో ఉన్నవి 8 వేల పాడి పశువులు మాత్రమే. లక్షల కొద్దీ కొన్నామని చెప్పి కోట్ల ప్రజాధనం దోచేశారు. ప్రభుత్వం తీసుకొచ్చింది పాలవెల్లువ పథకం కాదు పాపాల వెల్లువ పథకమని అన్నారు.
ప్రభుత్వంలో చేస్తున్న కుంభకోణాల గురించి వెల్లడిస్తుంటే మా గురించి విచారించడం కాదు... మీవాళ్ళు చేస్తున్న స్కాముల గురించి విచారణ చేయించండి. పశువుల కొంగోలులో  స్కామ్ ఎలా జరిగిందో, వేల కోట్ల సొమ్ములు ఎటు వెళ్లాయో ఎంక్వైరీ వేయించి తెలుసుకోవాలి. ప్రజలకు వివరించాలి. పొరపాటును సరిదిద్ది వేల కోట్ల ప్రజాధనాన్ని వెనక్కి తీసుకురావాలని డిమాండ్ చేశారు.

Related Posts