YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

తెలంగాణలో ప్రజాస్వామ్యం లోపించింది

తెలంగాణలో ప్రజాస్వామ్యం లోపించింది

హైదరాబాద్
తెలంగాణ ప్రజలు కోరుకుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. కానీ రాష్ట్రం ఒక వ్యక్తి ఉక్కుపాదాల కింద నలిగిపోతోంది. అందుకే రాష్ట్ర ప్రజల కోసం నా వంతుగా నేను పోరాడుతున్నానని టీపీసీసీ ఛీఫ్ రేవంత్ రెడ్డి ఆన్నారు. శుక్రవారం నాడు అయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యాక్రమంలో పాల్గోన్నారు.
రేవంత్ మాట్లాడుతూ చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చెబుతాం. అలగే మన రాష్ట్రం గురించి చెప్పాలంటే తెలంగాణ వచ్చాక,  తెలంగాణ రాకముందు అని చెప్పుకోవాలి. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారు. రాజకీయంగా నష్టపోతామని తెలిసినా.. ధర్మం వైపు నిలబడాలని రాష్ట్రం ఇచ్చారు. తెలంగాణ ప్రజలు కోరుకుంది స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అభివృద్ధి. కానీ రాష్ట్రం ఒక వ్యక్తి ఉక్కుపాదాల కింద నలిగిపోతోందని అన్నారు.
లెక్కలు వేసుకుని, స్వార్ధం చూసుకుంటే వంద మంది కేసీఆర్ లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. శ్రీకాంతాచారి లాంటి అమరుల త్యాగాలను గుర్తించి సోనియా తెలంగాణ ఇచ్చారు. దశాబ్దం గడిచినా నీళ్లు, నిధులు నియామకాలు సాధించుకున్నమా? ఒకసారి ఆలోచన చేయాలి. టీఆరెస్ ను పోలి ఉండేలా ఉండేందుకే వాహనాలకు టీజీ బదులు టీఎస్ అని పెట్టారు. రాష్ట్ర అధికారిక ముద్ర రాజరిక పోకడను తలపిస్తోంది. త్యాగాలను గుర్తు చేసేలా ఉండాల్సిన చిహ్నం రాచరికాన్ని తలపిస్తోంది. తెలంగాణ ప్రతీ తల్లి ప్రతీకలా తెలంగాణ తల్లి ఉండాలి. కానీ శ్రీమంతులు తెలంగాణ తల్లిని మనకు కేసీఆర్ చూపిస్తుండు. త్యాగాల పునాదులపై ఏర్పడిన తెలంగాణలో రచరికపోకడ కొనసాగుతోంది.తెలంగాణలో ప్రజాస్వామ్యం లోపించింది. ప్రజల హక్కులను కేసీఆర్ కాలరాశారు. రాష్ట్రంలో అందరినీ వర్గ శత్రువులా కేసీఆర్ చూస్తున్నారు. ఎన్నుకున్న ప్రభుత్వానికి ప్రజలు తమ బాధలు చెప్పుకోలేని పరిస్థితి. గతంలో పాలకులు ప్రజలకు సచివాలయంలో అందుబాటులో ఉండేవారు. కానీ ఇవాళ ప్రతిపక్ష నేతలకు,  జర్నలిస్టులకు సచివాలయంలోకి ప్రవేశం లేదు. కేసీఆర్ నియంత ముసుగులో ఉన్న క్రిమినల్ పొలిటీషియన్. మార్పు జరగకుండానే ఉద్యమకారుల జీవితాలు తారుమారయ్యాయి. ఆత్మహత్య చేసుకున్న యువతులపై ప్రభుత్వమే తప్పుడు ప్రకటనలు చేస్తున్న పరిస్థితి. కేసీఆర్ పాపాల పుట్ట పగిలింది..  మేడిగడ్డ కుంగింది. కేసీఆర్ ఇచ్చిన ఏ హామీనీ ఈ పదేళ్లలో నెరవేర్చలేదు. ప్రజలని మోసం చేసిన కేసీఆర్ లాంటి మోసగాళ్లకు తెలంగాణలో స్థానం లేదు. పదేళ్లలో ఎవరి భవిష్యత్ బాగుపడింది.. ఎక్కడ బంగారు తెలంగాణ? కర్ణాటకలో కాంగ్రెస్ గెలవద్దని ప్రచారం చేశారు..  అంటే పరోక్షంగా కేసీఆర్ కోరుకుంది మోదీ గెలుపేనా అని అన్నారు. బీఆరెస్ నేతలవి లాజిక్ లేని వాదనలు.కేసీఆర్ తాను చేసింది చెప్పుకోలేక కాంగ్రెస్ నపై ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ వాదనల్లో డొల్లతనం స్పష్టంగా కనిపిస్తోంది. కాంగ్రెస్ ఎప్పుడూ మైనారిటీలను కేవలం ఓటు బ్యాంకుగా చూడలేదు. రైతులకు ఎకరానికి ఏటా 10వేలు ఇస్తామని 2014లోనే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది. దాన్నే కాపీ కొట్టి కేసీఆర్ రైతు బంధు పేరుతో ఇస్తున్నారని అన్నారు.

Related Posts