YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

జగన్ కు అక్రమాస్తుల టెన్షన్

జగన్ కు అక్రమాస్తుల టెన్షన్

హైదరాబాద్, నవంబర్ 4,
ఏపీలో కూడా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది.  ఇప్పటికే విపక్ష తెలుగుదేశం  దూకుడు మీద ఉండగా.. జనసేన కూడా తెలుగుదేశంకు తోడు కావడంతో  అధికార వైసీపీలో ఓటమి భయం ముప్పిరి గొంది.ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ హైదరాబాద్ నుంచి  వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని కోరుతూ  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఆ పిటిషన్ ను సుప్రీం శుక్రవారం విచారించనుంది. జగన్ పై  సీబీఐ నమోదు చేసిన 11 కేసులు ఇప్పటి వరకూ 3,041 సార్లు వాయిదా పడ్డాయని తన పిటిషన్ లో పేర్కొన్న రఘురామకృష్ణం రాజు.. ఈ కేసులో విచారణ త్వరగా జరిపి నిందితులను శిక్షించాలన్న ఉద్దేశం సీబీఐలో కనిపించటం లేదని ఆరోపించారు. ఇందులో జగన్ కు ఇష్టానుసారం వాయిదాలు కోరే స్వేఛ్చను ఇచ్చారని..  ప్రస్తుత పరిస్థితులను చూస్తుంటే కేసుల విచారణ ప్రారంభమయ్యే పరిస్థితి కనిపించటం లేదని రఘురామరాజు తన పిటిషన్ లో పేర్కొన్నారు.  తమిళనాడుకు ముఖ్యమంత్రిగా చేసిన జయలలిత అక్రమాస్తుల కేసుల విచారణను కర్నాటకలో విచారణ జరిపినట్లే.. ఇప్పుడు జగన్ కేసుల విచారణను తెలంగాణలో కాకుండా మరో రాష్ట్రంలో  జరపాలని   తన పిటీషన్‌లో కోరారు.  జగన్ కేసుల విషయంలో విచారణ జాప్యం మీద సుప్రీం కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా  అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. పిటిషనర్ ఎంపీ రఘురామ కోరినట్లుగా వేరే రాష్ట్రానికి ఈ కేసుని బదిలీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఒక వేళ ఉంటే  ఏ రాష్ట్రానికి ఈ కేసు బదిలీ చేసే అవకాశం ఉంది అన్న చర్చ జోరందుకుంది. సుప్రీం ఈ కేసుపై అడిగే ప్రశ్నలకు సీబీఐ ఎలాంటి సమాధానం ఇవ్వనుంది.. ఎందుకు విచారణ ఇంత ఆలస్యమవుతుందంటే ఏ చెప్పనుందన్నది ఆసక్తిగా మారింది. ఈ కేసులో సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అది జగన్ మోహన్ రెడ్డికి ఇబ్బందికరమే అవుతుంది. ఈ కేసు మరో రాష్ట్రానికి బదిలీ చేసినా..  సీబీఐ కోర్టు విచారణకు జగన్ రావాల్సిందేనని నోటీసులు ఇచ్చినా కూడా అది జగన్ కు ఇబ్బందికరంగానే మారుతుందనడంలో సందేహం లేదు.   ఎన్నికల సమయంలో జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక మళ్లీ జగన్ కేసులపై జనం దృష్టి మళ్లడానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు. స్కిల్ కేసులో చంద్రబాబు గొప్పతనంపై జనంలో చర్చ జరిగింది. అదే జగన్ అక్రమాస్తుల కేసులో కదలిక వస్తే.. జగన్ అక్రమార్జన, క్విడ్ ప్రోకో, అరెస్టు వంటి  అంశాలపై  జనంలో చర్చ జరుగుతుందని  పరిశీలకులు  విశ్లేషిస్తున్నారు. దీంతో కేసులో ఎలాంటి కదలిక వచ్చినా అది జగన్ ప్రతిష్టకు  భగం వాటిల్లడమే కాకుండా.. ప్రతిపక్షాలకు ఒక ఆయుధంగా కూడా మారుతుంది. అసలే చంద్రబాబు అక్రమ అక్రమ అరెస్టుతో తెలుగుదేశం  శ్రేణులు ఇప్పటికే పదే పదే జగన్ కేసులను ప్రస్తావిస్తున్నాయి. జగన్ బెయిలు దశాబ్ద  ఉత్సవాలు అంటూ సెటైర్లు కూడా వేశాయి. ఇలాంటి సమయంలో సీబీఐ ఈ కేసు విచారణ వేగవంతం చేస్తే అది కచ్చితంగా   జగన్ కు ఇబ్బందికరంగా మారుతుంది. అలాగే ఒకవేళ ప్రతి శుక్రవారం సీబీఐ  కోర్టులో జగన్ విచారణకు రావాల్సిందేనని ఆదేశిస్తే..  అది జగన్  ప్రతిష్టకు డ్యామేజీ అవుతుందనడంలో సందేహం లేదు.  ఏది ఏమైనా  దేశ అత్యున్నత న్యాయస్థానం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.

Related Posts