YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

విజయసాయిరెడ్డి వర్సెస్ పురందరేశ్వరీ

విజయసాయిరెడ్డి వర్సెస్ పురందరేశ్వరీ

ఒంగోలు, నవంబర్ 6,
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తు ఖాయమైంది. జగన్ లక్ష్యంగా ఆ రెండు పార్టీలు ఒక్కటిగా వ్యవహరిస్తున్నాయి. బీజేపీ వైఖరి పైన స్పష్టత రావాల్సి ఉంది. కానీ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం సాగుతోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత సాయిరెడ్డి వర్సస్ పురందేశ్వరి మధ్య పొలిటికల్ వార్ పతాక స్థాయికి చేరింది. పురందేశ్వరి అవినీతి గురించి ప్రస్తావిస్తూ సాయిరెడ్డి సీబీఐ విచారణకు డిమాండ్ చేసారు. పురందేశ్వరి వర్సస్ సాయిరెడ్డి మధ్య పొలిటికల్ వార్ కొనసాగుతోంది. సాయిరెడ్డి పైన లిక్కర్ వ్యాపారానికి సంబంధించి పురందేశ్వరి ఆరోపణలు చేసారు. వీటి పైన సాయిరెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. దీనికి సంబంధించి సాయిరెడ్డి చేసిన ట్వీట్లు వైరల్ అయ్యాయి. అందులో సాయిరెడ్డి.. ఏపీలో మద్యం స్కాం అంటూ ఆరోపణలు చేసి, మీరు, మీ కుటుంబసభ్యులు మద్యం సిండికేట్ బ్రోకర్లతో మీ భర్త వెంకటేశ్వరరావు గారు, మీ కుమారుడు హితేష్, గీతం భరత్ బేరాలాడి ముడుపులు తీసుకున్నది నిజం కాదా.పురందేశ్వరిపై ఆరోపణలు:దీనికి కొనసాగింపుగా..ఎయిర్ ఇండియా ఇండిపెండెంట్ డైరెక్టర్ గా కేంద్రంలో ఒక బాధ్యతయతమైన పదవిలో ఉండి ఆ విమానయాన సంస్థ అమ్మకం విషయంలో మీరు మధ్యవర్తంచేసి ఆ సంస్థ నుంచి ముడుపులు తీసుకున్నది వాస్తవం కాదా? మీ నిజాయితీని నిరూపించుకోవడానికి సిబిఐ విచారణకు సిద్ధమేనా? ఆ మేరకు కేంద్రానికి రాయగలరా?..అంటూ మరో ట్వీట్ లో ప్రశ్నించారు. బీజేపీలో చేరిన తర్వాతైనా ఆమెవల్ల ఒక్క ఓటు అయినా అదనంగా పార్టీకి వచ్చిందా అంటే...ఇంకా పార్టీ ఓట్లను టీడీపీకి మళ్లించారనే చెప్పాల్సి ఉంటుందని పేర్కొన్నారు. పురందేశ్వరి పదవుల కోసం బీజేపీలోచేరి ఆ పార్టీని టీడీపీకి తాకట్టు పెట్టడానికి పనిచేస్తున్నారే కానీ ఆమెకు తన పార్టీపై ప్రేమ, అభిమానం లేవు. మొదట టీడీపీ..తర్వాత ఎన్టీఆర్ టీడీపీ, తర్వాత బీజేపీ, మళ్లీ కాంగ్రెస్...మళ్లీ బీజేపీ...ఇలా వరుసగా నాలుగుసార్లు పార్టీలు మారిన చరిత్ర పురందేశ్వరిది...అంటూ సాయిరెడ్డి వరుస ట్వీట్లు చేసారు. కాంగ్రెస్ కు మద్దతిచ్చే టీడీపీకి మీ మద్దతా ఈ సమయంలో సాయిరెడ్డి మరో ట్వీట్ లో.. అమ్మా పురందేశ్వరి గారూ...తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మీ మరిది గారి టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్‌కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే... మీది కుటుంబ రాజకీయమా? కుల రాజకీయమా? కుటిల రాజకీయమా? లేక బీజేపీని వెన్నుపోటుపొడిచే మీ రాజకీయమా?..అని ప్రశ్నించారు. దీంతో, ఈ ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఎటువంటి మలుపులు తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.

Related Posts