YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు బీఎస్పీ ప్లాన్

రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు బీఎస్పీ ప్లాన్

బీఎస్పీ అధినేత్రి మాయావతి పార్టీని కేవలం ఉత్తరప్రదేశ్ కే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాలకు విస్తరించాలని యోచిస్తున్నారు. 2014లో జరిగిన ఎన్నికల్లో కూడా తెలంగాణలో బీఎస్పీ అభ్యర్థులు విజయం సాధించారు. తర్వాత వారు పార్టీ మారిన సంగతి తెలిసిందే. అలాగే నిన్నమొన్నా జరిగిన కర్ణాటక ఎన్నికల్లో సయితం బీఎస్పీ ఒక స్థానంలో గెలిచింది. అక్కడ జనతాదళ్ ఎస్ పార్టీతో మాయావతి పొత్తుపెట్టుకున్నారు.ఇలా దళితులు వివిధ రాష్ట్రాల్లో అండగా ఉండటం గమనించిన మయావతి అన్ని రాష్ట్రాలకూ బీఎస్పీని విస్తరించాలని యోచిస్తున్నారు. ఈ ఏడాది జరగనున్న మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, రాజస్థాన్ ఎన్నికల్లో సయితం మాయావతి తమ అభ్యర్థులను బరిలోకి దింపాలని నిర్ణయించారు. ఈ మేరకు పార్టీ ప్రతినిధుల సమావేశంలో మాయావతి వెల్లడించారు. రాబోయే కాలంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడ బీఎస్పీ పోటీ చేస్తుందని ఆమె చెప్పారు. అలాగే పార్టీలో తన పట్టును కూడా ఆమె చెప్పకనే చెప్పారు. వచ్చే ఇరవై ఏళ్లపాటు తానే బీఎస్పీ అధ్యక్షురాలిగా కొనసాగుతానని ఆమె ప్రకటించారు. ఈమేరకు పార్టీ నియమావళిలో కూడా మార్పులు చేయనున్నట్లు ప్రకటించారు. అంతేకాకుడా పార్టీలో తన సోదరుడి పాత్రపై కూడా ఆమె పెదవి విప్పారు. తన సోదరుడు పార్టీ ఉపాధ్యక్షుడిగా కొనసాగేందుకు కూడా పార్టీ నియమావళిలో మార్పులు చేస్తామని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగా పోటీ చేస్తుందని, అవసరమైన చోట్ల పొత్తు పెట్టుకుంటామని చెప్పారు. మొత్తం మీద మాయా వ్యూహం ఏంటో పార్టీ నేతలకే అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎస్పీతో పొత్తు ఉంటుందా? లేదా? అన్నది ఆమె స్పష‌్టత ఇవ్వలేదు.

Related Posts