YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

ఉప్పల్ బీఆర్ఎస్ లో ఐక్యతా రాగం

ఉప్పల్ బీఆర్ఎస్ లో ఐక్యతా రాగం

హబ్సిగూడా
ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి, ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి  ,ఉప్పల్ ఇంచార్జ్ రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి  మాట్లాడుతూ 10 సంవత్సరాలుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో అభివృద్ధి చెందిందో,సంక్షేమ కార్యక్రమాలు ఏ స్థాయిలో ప్రజలకు అందయో అందరికి తెలుసు. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని మన ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డి ఆధ్వర్యంలో అద్భుతమైన ప్రగతి సాధించాం. స్కై వాక్ కావచ్చు,డ్రైనేజి వ్యవస్థ కావచ్చు,వైకుంఠ దామలు అన్ని కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
ఈ నియోజకవర్గం ఒక్క మినీ ఇండియా,ఇతర రాష్ట్రాల నుండి వచ్చారు,ఇతర దేశాల నుండి సైతం ఇక్కడ నివసిస్తున్నారు. ఇక్కడ కేసీఆర్ నేతృత్వంలో ఐటీ కంపెనీ లు,ఇతర పరిశ్రమలు ఇక్కడ ఎన్నో ఉన్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఈ నియోజకవర్గంలో పెన్షన్,కంటి వెలుగు,షాది ముబారక్ వంటి సంక్షేమ కార్యక్రమాలు దాదాపు 96 వేల కుటుంబాలకు అందాయి. ఉప్పల్ లో గత ఎన్నికల్లో లాగా బీఆర్ఎస్ పార్టీని గెలిపించారు మళ్ళీ ఈసారి కూడా ఆర్ఎస్ గెలిపిస్తాం అని ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. సాధ్యం కాని హామిలు,అమలు చేయలేని హామీలు ఇచ్చేవారిని ఇక్కడ ప్రజలు నమ్మడం లేదు. ఎక్కడ చూసిన బిఎల్ఆర్ ను గెలిపిస్తాం అంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ఇక్కడ ప్రచారం చేయడం లేదు. ఇవాళ కేసీఆర్ భరోసా మ్యానిఫెస్టో లో 400 కే సిలిండర్ ఇస్తాం అని ముఖ్యమంత్రి చెప్పారు.మోడీ వంటింటిలో మంట పెడితే మన ముఖ్యమంత్రి కేసీఆర్ సిలిండర్ రేట్లు తగ్గించి మహిళలకు అండగా నిలిచారు. ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్ధి నామీద కేస్ లు ఉన్నాయో చెప్పండి అని కోర్ట్ కు వెళ్లారు ఆయన పరిస్థితి ఇలా ఉంది. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవుతాడు సౌత్ ఇండియా లో రికార్డ్ సాధిస్తామని అన్నారు.
ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మేము అందరం కలిసి పని చేస్తాం అని తెలియజేస్తున్నాం. కార్యకర్తలను అందరిని కలుపుకొని ముందుకు పోదాం. మా అన్న ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు అలానే సుభాష్ రెడ్డి కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. మా అన్న ఎలానో మీరు అలానే అదే తరహా కలిసి పనిచేద్దాం. మీకు నేను సహకరించాను, మీరు నాకు సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్న. ఉప్పల్ నియోజకవర్గంలో మరోసారి బీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్ గిఫ్ట్ గా ఇస్తామని అన్నారు.
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు. ఇవాళ ఎక్కడ చూసిన బీఆర్ఎస్ వైపు చూస్తున్నారు. 3వ తేదీన ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుంది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ జెండా ఎగిరి ముఖ్యమంత్రి కేసీఆర్ మూడవసారి ముఖ్యమంత్రి అవుతాడు. మన ఉప్పల్ నియోజకవర్గంలో మంత్రి కేటీఆర్ సహకారంతో స్కై వే లు ప్లై ఓవర్ లు ఏర్పాటు చేశారు. రేవంత్ రెడ్డి చిప్ ట్రిక్స్ చేస్తున్నారు.కొడంగల్ ఓటమి చెందుతాడు కాబట్టి కామారెడ్డి లో సీఎం పై పోటీ అంటున్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేసి ఎలాగూ ఒడిపోతాడు కాబట్టి కొడంగల్ లో కూడా ఒడిపోయాను అని అనేందుకు ఇవన్నీ. ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డితో  నాకు గత 23 యేండ్లు గా కేసీఆర్ ఉన్న అనుబంధం ను గుర్తు చేసుకుంటున్నాను. పార్టీ పెట్టిన కొద్దిరోజులల్లోనే నేను పార్టీ లో జాయిన్ అయ్యాను.నాకు ఎమ్మెల్యే గా అవకాశం కల్పించారు. నన్ను కడుపులో పెట్టుకొని ఒక్క తండ్రి గా ఉన్నారు. నేను సీఎం కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ ఆదేశాల తో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. స్కై వే,ప్లై ఓవర్ లు,శిల్పారామం ,తోపాటు బస్తి దవాఖానలు ఇక్కడ నిర్మాణం చేసుకున్నాము. గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. కానీ గడిచిన 10 సంవత్సరాల లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. నేను తండ్రి మీద అలిగిన అందుకే నన్ను మళ్ళీ పిలిచికుని మాట్లాడారు.నేను సీఎం కేసీఆర్ మాట దాటాను. నేను సీఎం కేసీఆర్ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ ఆదేశాల మేరకు శక్తివంచన లేకుండా పని చేసి బిఎల్ఆర్ గెలిపించుకుంటాం. ఇది ఒక్క వృక్షం ...వృక్షం ను కాపాడుకోవడం మన బాధ్యత. ఎంతో మంది ఇవాళ ఇతర పార్టీల నాయకులు ఆ పార్టీలను విడి బీఆర్ఎస్ లోకి వచ్చారు. నాపై కూడా అనేక మంది అనేక రకాలుగా మాట్లాడారు కానీ మొదటి నుండి ఇదే పార్టీ...నేను పార్టీ మారే పరిస్థితి లేదు మారను. ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారా నే ఇవాళ నగరం అభివృద్ధి చెందింది. రానున్న రోజుల్లో హైదరాబాద్ నగరం మరింత అభివృద్ధి చెందాలి అంటే మళ్ళీ ఒక్కసారి బీఆర్ఎస్ పార్టీ నే గెలవాలి. ఉప్పల్ ఈశాన్యం లో ఉంది ఏ కార్యక్రమం జరగాలన్నా ఇక్కడ నుండే జరగాలి. అందుకే ఇక్కడ అనేక ఐటీ కంపనీ లు వచ్చాయి. మేమె హిందువులు అని కొంత మంది అంటున్నారు. ఎం చేశారు హిందులకు....ఒక్క గుడి అయిన కట్టారా....ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి గుడి కట్టారు మీరు ఎం కట్టారు. రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ పార్టీనే....ఉప్పల్ లో గెలిచేది కూడా బీఆర్ఎస్ అభ్యర్థి బిఎల్ఆర్ నే అని అన్నారు.  రానున్న రోజుల్లో ఉప్పల్ కు ఒక్క మహర్దశ రానుందని అన్నారు.

Related Posts