హైదరాబాద్
ఓయూ పీఎస్ పరిధి ఇఫ్లూ లో విద్యార్థులు ఆందోళనకు దిగారు. లైంగిక వేధింపులకు గురైన అమ్మాయికి న్యాయం చేయాలని విద్యార్థులు డిమాండ్ చేసారు. ఇఫ్లూ విసి కి వ్యతిరేకంగా నినాదాలు చేసారు. సమాచారం అందుకున్న ఓయూ పోలీసులు భారీగా చేరుకున్నారు. ఇఫ్లూ గేట్ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులు అరెస్ట్ చేసారు. గేట్ లోపల మరికొంత మంది విద్యార్థునులు అందోళనకు దిగారు. వారిని కుడా అరెస్టు చేసి ఓయూ పీఎస్ కు తరలించారు. నిరసన చేస్తున్న విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేసారు.