YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కడప కు బ్రౌన్ పేరు పెడతారా.. జగన్ కు నెట్ జన్ల ప్రశ్న

కడప కు బ్రౌన్ పేరు పెడతారా.. జగన్ కు నెట్ జన్ల ప్రశ్న

వైసీపీ అధికారంలోకి వస్తే పశ్చిమగోదావరి జిల్లాకు మన్నెం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరు పెడతామని వైసీపీ అధినేత జగన్ ప్రకటించడంపై ప్రజల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు.ఇంతకుముందు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామని జగన్ చెప్పారు. ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లాకు కూడా పేరు మారుస్తానని చెప్పారు

మరికొందరు జగన్ తీరుపై సెటైర్లు వేశారు. మార్చాల్సింది పేర్లు కాదని.. రాష్ట్రాల దశదిశ మార్చాలని అంటున్నారు.వచ్చే ఎన్నికల్లో ఓట్ల కోసం జగన్ వేస్తున్న ఎత్తులే తప్ప ఇందులో చిత్తశుద్ధేమీ లేదంటూ ఇంకొందరు విమర్శిస్తున్నారు.జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో నెటిజన్లు భారీ స్థాయిలో సెటైర్లు వేస్తున్నారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు కూడా మార్చాలని.. ఆ జిల్లాకు సీపీ బ్రౌన్ పేరు పెట్టాలని ప్రసాద్ అనే నెటిజన్ వ్యాఖ్యానించారు.ఎందరో మహానుభావులు పుట్టిన గడ్డ తెలుగు గడ్డ. వారి పేర్లు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ, దానికో సందర్భం ఉండాలి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇలాంటి హామీ ఇవ్వడం ప్రజలను మభ్యపెట్టడమే' అని సందీప్ జంజిరాల అనే ఫేస్‌బుక్ యూజర్ దీనిపై వ్యాఖ్యానించారు.తెలంగాణలో కొమురం భీమ్, జయశంకర్ వంటివారి పేర్లు పెట్టినట్లే ఏపీలోనూ అలా చేసి మహానుభావుల రుణం తీర్చుకోవాలన్న జగన్ ఆశయం గొప్పదని బైరెడ్డి అశోక్ రెడ్డి అభిప్రాయపడ్డారు.అల్లూరి గొప్పవ్యక్తనడంలో ఎలాంటి సందేహం లేదని, కానీ.. వందల ఏళ్లుగా అన్నం పెడుతున్న గోదావరి పేరు తొలగించడం సరికాదని.. కొత్తగా యూనివర్సిటీలు, మెడికల్ కాలేజీలు వంటివి ఏర్పాటు చేసి వాటికి అల్లూరి పేరు పెట్టాలని పాటూరి మురళీధర్ అనే నెటిజన్ అభిప్రాయపడ్డారు.జిల్లాల పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల తలరాతలు మారవని.. విద్య, వైద్యం, ఉపాధి అందరికీ అందుబాటులోకి తేవాలని.. పల్లెపల్లెకూ మౌలిక వసతులు కల్పించడం అవసరమని ఎక్కువ మంది నెటిజన్లు సూచించారు. మరో యూజర్ సత్యనారాయణ అయితే.. చర్లపల్లి జైలుకు జగన్ పేరు, చంచల్‌గూడ జైలుకు గాలి జనార్దన రెడ్డి పేరు పెట్టాలంటూ సెటైర్ వేశారు. మరో యూజర్.. విశాఖకు విజయసాయిరెడ్డి, విజయనగరానికి బొత్స, గుంటూరుకు అంబటి రాంబాబు పేరు పెట్టాలంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.శంషాబాద్ విమానాశ్రయానికి ఎన్టీఆర్ పేరు పెట్టనివ్వకుండా రాజీవ్ గాంధీ పేరు పెట్టారు కదా, ఇప్పుడు కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతామంటే ఎలా నమ్మాలని రఘునాథ్ అనే నెటిజన్ ప్రశ్నించారు. మొత్తానికి పాదయాత్రలో భాగంగా జిల్లాల్లో తిరుగుతున్న జగన్.. ఆయా జిల్లాలకు అక్కడి గొప్పవ్యక్తుల పేర్లు పెడతానని చెప్తుండడంపై సానుకూలంగా కొందరు స్పందిస్తుంటే, ఇంకొందరు మాత్రం ఇదంతా రాజకీయమంటూ కొట్టిపారేస్తున్నారు

Related Posts