YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు తెలంగాణ

వనపర్తి టికెట్ కోసం అందోళన

వనపర్తి టికెట్ కోసం అందోళన

హైదరాబాద్
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా సమయం లేదు. దాంతో.. ఇప్పటికే టికెట్ దక్కిన ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఈసారి గెలిస్తే ఏం చేస్తామో చెబుతూనే.. ప్రత్యర్థులపై విమర్శలు ఎక్కుపెడుతు న్నా రు.అయితే..అధిష్టానం నుంచి ఒకసారి టికెట్ వచ్చాక ఆ అభ్యర్థి ఎంతో సంబరపడి ప్రచారానికి సన్నాహాలు చేసుకుంటున్న తరుణంలో అదిష్టానం ఇచ్చిన షాక్ వర్గీయులను ఆందోళకు గురి చేసింది.దీంతో ఆందోళనకు దిగారు ఆ నాయకుడి వర్గీయులు. నాలుగో జాబితా ప్రకటించిన బీజేపీ ఓ వైపు బీఆర్ఎస్, బీజేపీలు ప్రచారంలో దూసుకెళ్తుంటే.. కాంగ్రెస్లో మాత్రం ఇంకా టికెట్ల పంచాయితీ కొనసాగుతోంది. టికెట్ల కేటాయింపు కాంగ్రెస్ పెద్దలకు పెద్ద తలనొప్పిగా మారింది. అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రెస్ లో కన్ప్యూజన్ కొనసాగుతున్నట్లు వనపర్తి నియోజకవర్గ పరిస్థితిని బట్టి అర్థమ వుతోంది. వనపర్తి నుంచి పోటీ చేసేందుకు చెన్నారెడ్డి, మేఘారెడ్డి ఇద్దరూ విజ్ఞప్తి చేశారు. అయితే.. మొదట కాంగ్రెస్ టికెట్ చెన్నారెడ్డి దక్కింది. ఫస్ట్ లిస్ట్లోనే ఆయన పేరును ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. దాంతో.. ఆయన నియోజకవర్గంలో తన గెలుపునకు బాటలు వేసుకోవడం మొదలుపెట్టా రు. ప్రచారంలో రెగ్యులర్గా పాల్గొంటూ ప్రజలకు విన్నవించుకుంటున్నారు. నామినేషన్ కూడా వేసేం దుకు సిద్ధం అవుతున్న సమయంలో ఆయనకు కాంగ్రెస్ అనుకోని షాక్ ఇచ్చింది.తాజాగా విడుదల చేసిన జాబితాలో వనపర్తి నియోజకవర్గానికి చెన్నారెడ్డి స్థానంలో మేఘారెడ్డి పేరు ఉండడంతో కంగు తిన్న కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం వద్దకు చేరుకుని ఆందోళన చేపట్టారు. గాంధీ భవన్ ముందు కూర్చొని చెన్నారెడ్డికి మద్దతు నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. ముందుగా ప్రకటించినట్లుగానే చెన్నారెడ్డికే వనపర్తి టికెట్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు.

Related Posts